సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో మున్సిపల్ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా చైర్పర్సన్, వైస్ చైర్మన్, వివిధ వార్డు కౌన్సిలర్లు, కో- ఆప్షన్ సభ్యులు, కమిషనర్, మున్సిపల్ శాఖ, అధిపతులు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్, మిగతా మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కౌన్సిలర్లు వారి వార్డులలో గల వివిధ సమస్యలను అధ్యక్షురాలు చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యలపై సానుకూలంగా స్పందించి సత్వరమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్ పర్సన్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంపై కౌన్సిలర్ల దృష్టికి తేవడానికి కలెక్టర్ ఆదేశానుసారం మున్సిపల్ కౌన్సిల్ కి ఆర్డిఓ వచ్చి ప్రజా పాలన ఉద్దేశాన్ని దాని ద్వారా తీసుకునే అప్లికేషన్ల గురించి క్లుప్తంగా కౌన్సిలర్లకు వివరించడం జరిగింది.
ప్రజాపాలనపై మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం




