‌ప్రజాతంత్ర దినపత్రిక నిజాయితీకి నిలువుటద్దం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30:  ‌ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక-2023 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్‌ను  రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య  శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆవిష్కరించారు. శుక్రవారం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో  మంత్రి  హరీష్‌రావు  ‘ప్రజాతంత్ర’ దినపత్రిక బ్యూరో ఇంఛార్జి అయ్యమ్మగారి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో కలిసి మంత్రి హరీష్‌రావు క్యాలెండర్‌ను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలే కీలకం అని అన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’దినపత్రిక పాత్ర మరువలేనిదనీ కొనియాడారు. మీడియా రంగం చాలా ఉధృతంగా విస్తరిస్తుందనీ, పత్రికకు సాంకేతికతను అందింపుచ్చుకుని మరింత సందేశాత్మక రీతిలో ఉపయోగపడాలన్నారు. ఇప్పటికే 24 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజాతంత్ర దినపత్రిక ప్రజలకు మరింత చేరువకావాలని క్యాలెండర్‌ ఆవిష్కరణలో పాల్గొన్న మరి కొందరు వక్తలు అభిప్రాయపడ్డారు.  ప్రజాతంత్ర దినపత్రిక నిజాయితీకి నిలువుటద్దమన్నారు. సామాజిక అంశాలతో ప్రజలను చైతన్యం చేసే దిశగా పత్రిక ప్రయత్నిస్తుందన్నారు. పత్రికలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. పజాతంత్ర దినపత్రిక అనునిత్యం ప్రజల సమస్యలపై ప్రభుత్వాలకు అనుదినం జన స్వరం వినిపించే పత్రిక ప్రజాతంత్ర అన్నారు.
పత్రికల పనితీరులో ప్రజాతంత్ర ప్రజల సమస్యలపై అధికార యంత్రాంగానికి చేరవేయడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుందన్నారు. ఇలాంటి పత్రికలు సమాజానికి ఎంతో అవసరం అని వక్తలు గుర్తు చేశారు. సమాజంలో పత్రికలతో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమాజం పట్ల పత్రికలు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక 23 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం శుభపరిణామన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటాన్ని సాగిస్తున్న ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలని వక్తలు ఆకాంక్షించారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజారాధాకృష్ణశర్మ, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు రాధాకృష్ణశర్మ, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కొండం సంపత్‌రెడ్డి, రాజనర్సు, పాల సాయిరాం,  జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌  ‌లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ములుగు డివిజన్‌ ఆత్మ కమిటీ ఛైర్మన్‌ ‌గుండా రంగారెడ్డి, గజ్వేల్‌-‌ప్రజ్ఞాపూర్‌ ‌మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌నేతి చిన రాజమౌలి,  ప్రజాతంత్ర విలేఖర్లు మరాటి కృష్ణమూర్తి, మస్కూరి జహంగీర్‌, ‌మిట్టపల్లి భరత్‌కుమార్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *