‌ప్రజాతంత్ర క్యాలెండర్‌, ‌డైరీ – 2023 ఆవిష్కరణ

ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర విలేఖరి, డిసెంబర్‌ 30 : ‌తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ ఆకాంక్షల కోసం ఏర్పడి మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజాతంత్ర దినపత్రిక 2023 నూతన సంవత్సర ‘క్యాలెండర్‌-‌డైరీ’ని ప్రజాతంత్ర వ్యవస్థాపక సంపాదకులు, ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వ జాతీయ మీడియా-అంతర్‌ ‌రాష్ట్ర వ్యవహారాల సలహాదారులు దేవులపల్లి అమర్‌ ఆవిష్కరించారు. శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్‌ ‌గార్డెన్‌ ‌హైదరాబాద్‌ ‌బుక్‌ ‌ఫెయిర్‌ ‌ప్రజాతంత్ర స్టాల్‌ ‌నెంబర్‌ 165 ‌వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అవార్డు(అనువాదం) కె.సజయకు మొదటి డైరీ అందజేశారు.

ఈ సందర్బంగా దేవులపల్లి అమర్‌ ‌మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో సమాజ హితం కోసం పనిచేస్తూ ప్రజాతంత్ర దినపత్రిక దిన దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర సంపాదకులు దేవులపల్లి అజయ్‌, ‌హెచ్‌.‌యు.జె(ఐజేయు) అధ్యక్షులు శిగ శంకర్‌ ‌గౌడ్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్టులు రవీందర్‌, ‌మల్లేశం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *