కప్పల తక్కెడలో నాయకులు
పక్క పార్టీల్లోకి ఇట్టే గెంతులు
టిక్కెట్ల వేటలోన సయ్యాటలు
తెగ మార్చేస్తున్నారు జెండాలు
వాదోపవాదాలకే సిద్ధాంతాలు
పీఠాల కోసమే ఇన్ని ఆరాటాలు
మీ వంకే చూస్తున్నారు జనాలు
వోటు బెత్తంతో వేస్తారిక వాతలు
– వి రమేష్ బాబు
మూడువేల కిలోమీటర్ల పైగా తెలంగాణా వ్యాప్తంగా పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి నవుతానంటూ పలు సందార్భాల్లో మాట్లాడిన తెలంగాణా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా ఎన్నికల బరిలో లేమని మీడియా ముఖంగా తెలియజేసారు. కేసీఆర్ పాలనను అంతమొందించడానికి..వ్యతిరేక వోటు చీలకుండా కాంగ్రెస్ పార్టీకి బేషరతు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. మొదటి రోజు నామినేషన్లు ప్రారంభమయినాయి.
నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముధోల్, ఆర్మూర్, కోరుట్ల నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి కామారెడ్డి నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఎంఐఎం పార్టీ ఆరు అసెంబ్లీ స్థానాలకు మొదటి లిస్ట్ విడుదల చేసింది. తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తామని పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.





