రాజకీయాల్లో మారింది రాగం
నేతల కీచులాటలే నేత్రపర్వం
కట్టు దాటిపోతే కయ్యాల బేరం
అదుపు తప్పితే పెనుప్రమాదం
గద్దెనెక్కాలని చేస్తుంటారు జపం
అజెండాలు మాత్రం మహాఘనం
ఐదేళ్లకోసారి తప్పదు మరి వ్రతం
వోటర్లు దీవిస్తేనే నెత్తిన మకుటం
– వి.రమేష్ బాబు
———–
గత నెల అక్టోబర్ 15న హుస్నాబాద్ నుంచి బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచార సభలు నవంబర్ 4 వరకు ..21 రోజుల్లో ..30 నియోజక వర్గాల్లో నిర్వహించారు. శనివారం సిద్ధిపేట, నంగునూరు మం. కోనాయపల్లిలో తన ఇష్ట దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించారు. నామినేషన్‌ల దాఖలుకు రెండవ రోజు గడువు ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని అసెంబ్లీ నియోజక వర్గ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసారు. భారతీయ జనతా పార్టీ, జనసేనల మధ్య పొత్తు కుదిరింది. జనసేన 11 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో దింపనున్నది.





