సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ
సిద్దిపేట, ప్రజాతంత్ర,డిసెంబర్ 30: 3వ రోజు ప్రజా పాలన లో భాగంగా సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్ పల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో రెండు పథకాలు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్,చేయూత కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల బీమా ఇప్పటికే అమలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపే మిగత 4 పథకాలను డిసెంబర్ 28వ తేదీ నుండి స్వీకరించడం జరుగుతుంది.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రజా పాలనను ప్రారంభించారు. అక్కడ అధికారులతో మాట్లాడి అక్కడ ఏమన్నా సమస్యలు ఎదురు అవుతున్నాయ అని అడిగి,ఎక్కువగా ఎ పథకాలకు దరఖాస్తులు వస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు ప్రజల ఎవరు కూడా భయాందోళన పడద్దు జనవరి 6వ తేదీ తర్వాత కూడా దరఖాస్తులను ప్రభుత్వ కార్యాలయంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, కార్యాలయంలో తీసుకోవడం జరుగుతుందని భరోసా నిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ కన్వీనర్ నాయిని నర్సింహారెడ్డి, అర్బన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భిక్షపతి, సీనియర్ కాంగ్రెస్ సత్యనారాయణ, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి గోపికృష్ణ.జిల్లా ఎస్ సి సేల్ కార్యదర్శి దాసు,యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పవన్,సాయి, ప్రతాప్,వంశి, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ శివకృష్ణ, వెంకటేష్,అంకం రాజేందర్, జునేడ్, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.





