ప్రజల వద్దకు ప్రజా పాలన

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29: ప్రజా పాలనలో ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దారు శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ సర్పంచ్ భానుప్రకాష్ రావు సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా తెలిపారు.  శుక్రవారం మండలంలోని తిగుల్, ఇటిక్యాల గ్రామలలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. గ్రామలలో ప్రతి కుటుంబం తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దరఖాస్తుల స్వీకరణ జనవరి 6 వరకు కొనసాగుతుందన్నారు.ఈ కార్యక్రమంలోమాజీ జడ్పీటీసీ లక్ష్మరెడ్డి,ఎంపిటీసి మంజుల మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఐలయ్య, నాయకులు రాజు, బాలకృష్ణ రెడ్డి, ఎంపీటీసీవాజీద్ బేగం అయ్యుం,కార్యదర్శి రాజగోపాల్, సత్యం, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజ్,దాస్ రత్నం రెడ్డి డాక్టర్ ఐల్లయ్య, కిరణ్,సీసీలు, విఓఏలు,  అంగన్వాడీ టీచర్లు,  ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *