ప్రజల మనసును గెలిచిన వీరుడు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8: ప్రత్యర్థులు, అనేక రకాల వాగ్దానాలు, వ్యూహాత్మక వ్యూహాలను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇవన్నీ తట్టుకొని ప్రజలను మెప్పించి వారి మనసును గెలిచి, భారీ మెజార్టీతో అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధించారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ శాసనసభ్యులుగా మరోసారి విజయం సాధించిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు, సీనియర్ సిటీజన్లు, పలువురు సుధీర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇట్టి నియోజకవర్గన్నీ మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *