పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 14: పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని బిఆర్ఎస్ పార్టీ, అభ్యర్థి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సురేందర్, వంశీ ఆధ్వర్యంలో 120 మంది యువకులు ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతోందని, ప్రజల ఆశీస్సులతో మూడోసారి గులాబీ జెండాను ఎగరవేయబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అనంతరం పార్టీ కార్యాలయం ప్రారంభించారు.ఈ
కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, కౌన్సిలర్ బాబ్జి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.





