‌ప్రజల తెలంగాణ కాంగ్రెస్‌ ‌తోనే సాధ్యం… యుద్ధం కాంగ్రెస్‌…‌బీఆరెస్‌కు మధ్యనే

నర్సంపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : ‌ప్రజల తెలంగాణ కాంగ్రెస్‌ ‌తోనే సాధ్యమని కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ అన్నారు. శుక్రవారం నర్సంపేటలో నిర్వహించిన రోడ్‌ ‌షోలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణాలో బీఆరెస్‌కు, కాంగ్రెస్‌కు మధ్యనే యుద్ధమని, కుటుంబ పాలనకు చరమగీతం పాడటం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు తనకు ఉన్న సంబంధం రాజకీయ సబంధం కాదు…రక్త సంబంధమన్నారు. తెలంగాణకు కాంగ్రెస్‌కు ఉన్న సంబంధం ఇప్పటిది కాదని, ఎన్నో ఏళ్లుగా జవహర్‌లాల్‌ ‌నెహ్రూ, ఇందిర గాంధీ, రాజీవ్‌ ‌గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్‌ ‌గాంధీ వరకు ఉందన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిందేనని సోనియా గాంధీ ఆనాడే  అన్నారని గుర్తు చేశారు. తెలంగాణను కేవలం ఒక్క కుటుంబం కోసం నిర్మించ లేదన్నారు. ఒకే ఒక్క కుటుంబం తెలంగాణలోని ఆస్తినంతా కూడబెట్టుకోవడానికి చూస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌దాదాపు లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోచుకున్నాడన్నారు. తనంతట తాను వెళ్లి కాళేశ్వరం మేడిగడ్డ బ్రిడ్జిని చూసానని తెలిపారు. బ్రిడ్జి కుంగి విరిగిపోయిందన్నారు.

కేసీఆర్‌ ‌ధరణి పోర్టల్‌ ‌ద్వారా వేలాది ఎకరాల ప్రజల భూమిని లాక్కున్నాడన్నారు. ఈ లాక్కున్న భూమిని కేసీఆర్‌ ‌కుటుంబం, బీఆరెస్‌ ‌నేతలు పంచుకున్నారన్నారు. అధిక ప్రాధాన్యత గల మంత్రి పదవులన్నీ కేసీఆర్‌ ‌కుటుంబం చేతిలోనే ఉన్నా యన్నారు. భూమి, మద్యం, ఇసుక మొదలగునవి అన్నీ వారి స్వాధీనం లోనే ఉన్నాయని తెలిపారు.. దళిత బందు పథకంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలు 3)క్షలు లంచం తీసుకున్నారన్నారు. 70 యేళ్లుగా కాంగ్రెస్‌ ఏం ‌చేసిందని అంటున్నా కేసీఆర్‌కు ఆయన చదువుకున్న సదువులన్నీ కాంగ్రెస్‌ ‌నిర్మించిన పాఠశాలలు, కళాశాలల్లో కాదా అని గుర్తు చేశారు. ఏ హైదరాబాదులో లక్షల, కోట్ల ఐటీ వసూలు చేస్తున్నారో ఆ హైదరాబాదు నిర్మించింది కాంగ్రెస్‌ ‌కాదా అన్నారు.  ఈ రోడ్లు, ఇళ్లు, రవాణా మొత్తం కాంగ్రెస్‌ ‌నిర్మించేదేనన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచిత కరెంటు ఇచ్చింది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మళ్లీ ఉచిత కరెంటు ఇస్తుందని మాట ఇస్తున్నానన్నారు. కరెంటు కోసం రైతులు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదన్నారు. అంతే కాకుండా రైతులకు ఎకరానికి 15వేల రూపాయల ఆర్థిక సాయం వారి బ్యాంకు ఖాతాలో జమ చేయబోతున్నామన్నారు. కూలీలకు 12 వేల రూపాయలు సాయమందించనున్నట్లు తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు అందించనున్నట్లు చెప్పారు.

అదే విదంగా 24 గంటల విద్యుత్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళల్లారా గ్యాసు రేటు ఎంత పెరుగుతోందో గమనించారా 1200రూపాయలకు లబిస్తోంది, కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 500 రూపాయలకే గ్యాస్‌ ఇస్తామన్నారు. ప్రతీ మహిళ బ్యాంకు ఖాతాలో నెల నెల 2500 రూపాయలు జమ చేస్తామన్నారు. మహిళలు నెలకు 2వేల రూపాయలు ప్రయాణానికి ఖర్చు చేయాల్సి వస్తోంని, తెలంగాణలో ఎక్కడైనా  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఉన్నత విద్యకు 5లక్షల రూపాయలు సాయమందించనున్నట్లు తెలిపారు. చేయూత ద్వారా ప్రతీ ఒక్కరికి 4వేల  రూపాయలు అందించనున్నట్టు చెప్పారు.

కాంగ్రెస్‌ ‌వచ్చాక మొదటి మంత్రి వర్గ సమావేశంలోనే ఈ ఆరు గ్యారెంటీ పథకాలను ఆమోదించనున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ ‌కుటుంబ పాలన చేశారని, కాంగ్రెస్‌ ‌మాత్రం దళిత, బలహీన పేద వర్గాల కోసం పాలన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రజల ప్రభుత్వం నేను  మాట ఇస్తున్నాను కేసీఆర్‌ ‌దోచుకున్నదంతా తిరిగి ప్రజల ఖాతాలో జమ చేస్తానన్నారు. ఇది కాంగ్రెస్‌ ఉన్న అన్నీ రాష్ట్రాల్లో  ముఖ్య మంత్రులకు ఆదేశాలిచ్చామన్నారు. కేసీఆర్‌ ‌దోచుకున్న పైసలతోనే ఉచిత కరెంటు ఇవ్వబోతున్నామన్నారు. ఎంఐఎం, బీజేపీ, బీఆరెస్‌ ‌మూడు ఒక్కటేనని అన్నారు. బీజేపీకి ఈ రాష్ట్రంలో బీఆరెస్‌ ‌సాయం చేసో•ందన్నారు. కాంగ్రెసుకు వ్యతిరేఖంగా ఎంఐఎం పోటీ చేస్తోందన్నారు. ప్రజల తెలంగాణను చేయబోతున్నామన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పాటు తద్యమని, ప్రజల ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *