ప్రజల క్షేమం కోరి రాహుల్‌ యాత్ర..

మోదీని ఓడిస్తేనే మేలు
దిల్లీ సభలో మల్లిఖార్జున ఖర్గే పిలుపు
అద్వానీకి భారతరత్న రావడం ఆనందం : ఆలస్యంగా అయినా గుర్తించారన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 3 : మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే రాహుల్‌ గాంధీ పోరాటం చేస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఒకవేళ ఈ పోరాటం విఫలమైతే మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కష్టాలు తప్పవన్నారు. పార్టీలో ఏ ఒక్కరూ తీసుకోని సాహసోపేత నిర్ణయం రాహుల్‌ తీసుకున్నారని కొనియాడారు. ఈ మేరకు తూర్పు దిల్లీలో జరిగిన ‘న్యాయ్‌ సంకల్ప్‌ సమ్మేళన్‌’ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. యువత, మహిళలు, రైతులు, పేదలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర చేపట్టారని ఖర్గే అన్నారు. ప్రతికూల, శీతల వాతావరణంలో ఈ యాత్ర కొనసాగుతుందన్నారు.

భాజపా అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం అని చెప్పారు. ‘ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్‌ చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు ఇవ్వకపోతే మోదీకి బానిసలుగా మిగిలిపోవాల్సి ఉంటుంది‘ అని ఖర్గే హెచ్చరించారు. యువతకు ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి రప్పిస్తామంటూ బూటకపు హావిూలతో మోదీ గద్దెనెక్కారని ఖర్గే విమర్శించారు. ఇచ్చిన హావిూలను అమలు చేయకపోవడమే మోదీ గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే..కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షానికి చెందిన 411 మంది శాసనకర్తలపై కేసులు పెట్టి.. భాజపా జైలుకు పంపిందన్నారు. విపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టి ఆయా రాష్టాల్లో అధికారం చేపడుతోందని దుయ్యబట్టారు. రaార్ఖండ్‌లో ఆ పార్టీ చేస్తున్న కుటిల యత్నాలు ఎంతమాత్రం ఫలించవన్నారు. దిల్లీలో బూత్‌ స్థాయిలో పార్టీ బలోపేతానికి నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *