‌ప్రజల ఆశిస్సులతో జాతీయ రాజకీయాల్లోకి

  • 2024లో కేంద్రంలో మన ప్రభుత్వమే
  • దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంట్‌
  • 2024 ఎన్నికలు దేశానికి అత్యం కీలకం
  • బావులకాడ మీటర్లు పెటాలంటున్న వారికే మనం మీటర్లు పెట్టాలి
  • బిజెపి ముక్త భారత్‌కు ప్రజలంతా మద్దతు పలకాలి
  • నిజామాబాద్‌ ‌సభలో సిఎం కెసిఆర్‌ ‌కీలక ప్రకటన
  • కార్పొరేట్లకు కేంద్రంలో ప్రభుత్వం దోచి పెడుతున్నదని ఫైర్‌
  • ‌త్వరలోనే సింగూరు ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు వొస్తాయని వెల్లడి
  • సవి•కృత కలెక్టరేట్‌ ‌భవానానికి ప్రారంభోత్సవం

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌దేశంలో అధికారంలో ఉన్న నిరంకుశ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ద్వారా దేశంలో కొత్త రాజకీయాలను ప్రారంభించబోతున్నామని సిఎం కెసిఆర్‌ ‌ప్రకటించారు. ఇందుకు ప్రజలు పూర్తి మద్దతు ప్రకటించాలన్నారు. 2024లో దిల్లీ గద్దెపై తమ ప్రభుత్వమే కొలువు దీరుతుందని సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు. వొచ్చే ఎన్నికల్లో బీజేపీ ముక్త్ ‌భారత్‌ ‌కోసం ప్రజలు వోటు వేయాలని కోరారు. నిజామాబాద్‌లో గిరిరాజ్‌ ‌కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌..‌దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అంతకుముందు నిజామాబాద్‌ ‌కలెక్టరేట్‌ ‌సముదాయన్ని కెసిఆర్‌ ‌ప్రారంభించారు. నిజామాబాద్‌ ‌జిల్లాలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆఫీసు, నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ‌ప్రసంగించారు. ప్రజల కోరిక, ఆశీస్సులతో త్వరలోనే జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని కేసీఆర్‌ ‌స్పష్టంచేశారు. 2024లో దేశంలోని రైతులందరికీ ఉచిత కరెంట్‌ ఇస్తామని హావి• ఇచ్చారు. ప్రజలంతా ఏకమై బావుల దగ్గర వి•టర్లు పెట్టాలంటున్న వారికి వి•టర్‌ ‌పెట్టాలని కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. బీజేపీ ముక్తభారత్‌ ‌నినాదంతో ముందుకు వెళ్తామని ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. దేశం బాగుపడాలంటే ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలని.. ప్రజాస్వామ్యబద్ధంగా దేశాన్ని ముందుకు తీసుకపోయే లౌకికవాద ప్రభుత్వం అవసరమన్నారు.

మోడీ ప్రభుత్వం అహంకారంతో ప్రతిపక్షాలను చీల్చి ప్రభుత్వాలను పడగొడుతుందని మండిపడ్డారు. మోడీ విధానాలతో అంతర్జాతీయంగా దేశం పరువుపోయే పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్‌ అన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన కేంద్రం మతపిచ్చితో మంటలు పెడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో గోదావరి నీళ్లు పారాల..లేక మతపిచ్చితో నెత్తురు పారాల అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. దేశంలో రైతులు వాడే కరెంట్‌ 20.8 ‌శాతమే అని..దానికి లక్షా 45వేల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందన్నారు. రైతుల కోసం లక్షా 45 వేల కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. బావుల దగ్గర మోటర్లుకు వి•టర్లు పెట్టాలంటున్న మోడీకి బుద్ది చెప్పాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.  రైతుల భూములు లాక్కోవాలన్నదే బీజేపీ ప్లాన్‌ అని, అన్నదాతలు వ్యవసాయం బంద్‌ ‌పెడితే భూములు కొనేందుకు కార్పొరేట్‌ ‌గద్దలు వాలుతాయని హెచ్చరించారు. మోడీ సర్కారు అన్నింటినీ అమ్ముకుంటూ పోతుంటే.. టీఆర్‌ఎస్‌ ‌సర్కారు మాత్రం సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలను ఆదుకుంటోం దని కేసీఆర్‌ అన్నారు.

ఉచిత పథకాలను రద్దు చేయాలంటున్న బీజేపీ సర్కారును సాగనంపాలని పిలుపునిచ్చారు. దేశంలో 83కోట్ల ఎకరాల భూమి ఉంటే..41కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉందని కేసీఆర్‌ ‌చెప్పారు. మోడీ అధికారంలోకి వొచ్చిన నుంచి ఒక్క ప్రాజెక్ట్ ‌గానీ ఒక ఫ్యాక్టరీ గానీ కట్టారా అని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ ‌పరం చేస్తూ దేశాన్ని మోడీ ఆగం చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కార్మిక, ప్రజావ్యతిరేక ప్రభుత్వం పోయి..నాన్‌ ‌బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో పాలకుల ఏమరపాటు వల్ల తెలంగాణను ఆంధ్రాలో కలిపారని, మన తెలంగాణ మనం తెచ్చుకోనీకే 60 ఏండ్లు పట్టిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. వలస పాలనలో సింగూరు, నిజాం సాగర్‌ ‌నీళ్లు మనకు లేకుండా పోయాయని చెప్పారు. దేశంలో అన్ని రంగాలకు 24గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో  మనమే నెంబర్‌ ‌వన్‌ అని చెప్పారు. దళిత  కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇచ్చే రాష్ట్రం తమదేనన్న కేసీఆర్‌… ‌తండాలను గ్రామాలుగా మార్చిన ఘనత తమ ప్రభుత్వ సొంతమని చెప్పారు.

నిజామాబాద్‌లో గుంట వ్యవసాయ భూమి కూడా ఖాళీగా ఉండొద్దని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 2024 తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నాన్‌ ‌బీజేపీ జెండానే ఎగురుతుందని, దిక్కూమలిన, రైతుల వ్యతిరేక బీజేపీని సాగనంపుదామని పిలుపునిచ్చారు.  అప్పుడు తెలంగాణ తరహాలో భారతదేశ యావత్‌ ‌రైతాంగానికి ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటిస్తున్నాను. ఈ దేశం కోసం తెలంగాణ నుంచి పోరాటం చేయాలి. ఎవరైతే బాయికాడ వి•టర్‌ ‌పెట్టమని అంటున్నారో.. ఎవరైతే రైతాంగాన్ని ఆత్మహత్య చేసుకోవాలని చెప్తున్నారో.. మనందరం ఏకమైన వారికే వి•టర్‌ ‌పెట్టాలి. అట్ల అయితనే బాగుపడుతాం అని కెసిఆర్‌ అన్నారు. దేశంలో బ్రహ్మాండమైన నదులు ఉన్నాయి. ఒక్కటి కూడా పెద్ద రిజర్వాయర్లు లేవు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. కొత్త ఫ్యాక్టరీ పెట్టలేదు. అన్ని అమ్ముకునుడు తప్ప కొత్తది చేయలేదు. దయ చేసి రైతు సంఘాలు, రైతు బిడ్డలు సమావేశాలు పెట్టి రైతు వ్యతిరేక విధానం అవలంబిస్తున్న పార్టీలను తిప్పికొట్టాలని కేసీఆర్‌ ‌సూచించారు. త్వరలోనే సింగూరు ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు వొస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన పరిపాలన భవనం నిర్మించుకుని ప్రారంభించినందుకు జిల్లా అధికార యంత్రాంగాన్ని, ప్రజలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని కేసీఆర్‌ ‌తెలిపారు. వి• బిడ్డగా ఒకటే కోరుతున్నాను. ఎప్పటికప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అప్పుడే సమాజం బాగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరిజు వేసుకుంటూ ముందుకు పోయే సమాజం ఉజ్వలంగా ముందుకు పోతోందన్నారు.

ఒకనాడు నిజామాబాద్‌ ‌జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు నిజాం సాగర్‌ ‌నిర్మించుకున్నాం. కానీ వలస పాలనలో నిజాం సాగర్‌కు, సింగూరు ప్రాజెక్టుకు సాగునీరు మనకు రాలేదు. ఎన్నోసార్లు మన పొలాలు ఎండుతున్నాయని ధర్నాలు చేశాం. ఆ ధర్నాల్లో నేను కూడా పాల్గొన్నాను. కొద్ది రోజుల్లో కాళేశ్వరం కాల్వలు సింగూరు ప్రాజెక్టు వద్దకు వొస్తున్నాయి. దీంతో ఒక గుంట భూమి కూడా ఖాళీ లేకుండా ఉంటది. వి• అందరి దీవెనతో భారతదేశమే ఆశ్చర్యపడే పద్దతిలో ముందుకు పోతోంది. మన పొరుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో వి•కు తెలుసు. మన దగ్గర మహిళలు, పేదలు, విద్యార్థులకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. దేశంలోనే అతి ఉత్తమమైన 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అం‌దిస్తున్నాం. అనేక తరతరాల నుంచి అణిచివేయబడ్డ దళిత సోదరుల కోసం రూ. 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. 60 ఏండ్లు మొత్తుకున్న గిరిజన బిడ్డాలకు పంచాయతీలను ఏర్పాటు చేయలేదు. 3600 తండాలను పంచాయతీలను ఏర్పాటు చేస్తే 3600 మంది సర్పంచ్‌లు అయ్యారు. గురుకుల పాఠశాలలు, కల్యాణలక్ష్మి, రైతుబీమా వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. తొలుత కొత్తగా నిర్మించిన నిజామాబాద్‌ ‌జిల్లా సవి•కృత కలెక్టరేట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం ప్రారంభోత్సవం చేశారు.

జిల్లాల్లో సకల సదుపాయాలతో సవి•కృత కలెక్టరేట్లను నిర్మించేందుకు నిర్ణయించిన విషయం విధితమే. ఇందులో భాగంగా నిజామాబాద్‌లో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం సకల సదుపాయాలతో సవి•కృత కలెక్టరేట్‌ను నిర్మించింది. ఇటీవల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రాగా..సీఎం కేసీఆర్‌ ‌కలెక్టరేట్‌ను ప్రారంభించారు. కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ ‌సీ నారాయణరెడ్డిని సీటులో  కూర్చుండబెట్టారు. పుష్పగుచ్ఛం అందించి.. శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌కు అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ ‌సోమేశ్‌కుమార్‌, ‌సీఎంవో అధికారి స్మితా సబర్వాల్‌, ‌నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *