ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 16: ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ మాత్రమేనని విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గ్రీన్, ఓపెన్ జోన్ తొలగింపు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బిఏంసి అల్మాస్ గూడ ఆడివి రెడ్డి గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్య అతిధిగా సబితా ఇంద్రారెడ్డి హాజరై ప్రసంగించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి అనుగుణంగా.. చట్టాలను చట్ట సభల ద్వారా మార్చి ప్రజలకు న్యాయం చేసే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాలకు గుదిబండగా మారిన 111 జీవో అయిన, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో గ్రీన్, ఓపెన్ జోన్   సమస్యతో చాలా ఇబ్బందులు పడినట్లు చెప్పారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ 111 జీఓ తో పాటు గ్రీన్ ఓపెన్ జోన్ ను ఎత్తి వేసినట్లు చెప్పారు. ప్రజలకు ఉపయోగపడేలా అడుగులు వేసేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా నా బాధ్యతను ఏరిగి ప్రజల సమస్యను పరిష్కరించానని అన్నారు. ప్రజల సమస్యలను మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని పరిష్కరించే గొప్ప నాయకులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారాని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, పని చేసే నాయకులను ఎప్పుడు విస్మరించారని సూచించారు. ఏళ్ల కొద్దిగా పడుతున్న మీ సమస్యను తెలుసుకొని పరిష్కరించిన కేసీఆర్ కు మనందరం అండగా నిలిచి, బిఅర్ఎస్ పార్టీకి ఓటు వేసి, గెలిపించాలని కోరారు. ఒక్కప్పుడు అరచేతిలో కొంచం కారం పెడితే, అరు కాలాలు గుర్తించుకునే వాళ్ళని ఇంతటి పెద్ద సహాయం చేసిన కేసీఆర్ కి ఎల్లవేళలా మనమంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు  ప్రాంతాల ప్రజలకు గుదిబండగా మారిన గ్రీన్, ఓపెన్ జోన్లను రెసిడెన్షియల్ జోన్ గా మార్చినందుకు ఆయా కాలనీల ప్రజలు మంత్రికి ధన్యవాదాలు తెలిపి, ఘనంగా సన్మానించారు. అనేక సంవత్సరాలుగా ఉన్న సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి మంత్రి పరిష్కరించారని, ఎప్పుడు మేము అంత సబితమ్మకు అండగా ఉంటామన్నారు. రానున్న ఎన్నికల్లో సబితమ్మను గెలిపించుకుంటామని శపథం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్ సమ్ రెడ్డి స్వప్న వెంక రెడ్డి, రామిడి రాం రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, తుపాన్ రెడ్డి, పలువురు బిఅర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రీన్, ఓపెన్ జోన్ కాలనీల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *