ప్రజలు బాగుపడాలంటే బిజెపికి ఓటు వేయాలి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి

 మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 14:   ఆర్ఎస్,  కాంగ్రెస్ అభ్యర్థులు అవినీతికి మాత్రమే పోటీ పడుతున్నారని, వారి అసత్య ఎన్నికల హామీలు నమ్మొద్దని మేడ్చల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఎన్నికలప్పుడువచ్చే
 వ్యక్తిని కాదని ఎల్లప్పుడూ మీ మధ్యలో  ఉండే మీ బిడ్డ నని  మేడ్చల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ పిలుపు నిచ్చారు. మేడ్చల్ పట్టణం, ఎల్లంపేట గ్రామంలో  బీజేపీ పార్టీ కార్యాలయాలు ప్రారంభించి  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడాతు తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామాకాలు వస్తాయని, దీంతో పేదలు, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశించాం కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రమే వెలుగులు నిండాయని ఆరో పించారు. బీఆర్ఎస్ కు ఓటేయ్యకుంటే ప్రభుత్వ పథకా లైన పింఛన్లు, డబుల్ బెడ్రూంలు ఇవ్వమని బీఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారని.బిఆర్ఎస్,  కాంగ్రెస్ అభ్యర్థులు అవినీతికి మాత్రమే పోటీ పడుతున్నారని అభివృద్ధి కొరకు పాటుపడరని ఎన్నికల వరకే హామీలు, డబ్బు వాసన చూపించి ఓట్లు అడుగుతున్నారని అన్నారు.  తనపై ఏ ఒక్క తప్పుడు ఆరోపణ లేదని ప్రజలు బాగుపడాలంటే  బిజెపికి ఓటు వేసి మేడ్చల్ లో అత్యధిక మెజార్టీతో  గెలిపించాలని సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *