ప్రజలు ఎవరికీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు

మోదీతో పాటు…వ్యవస్థలతోనూ పోరాడాం
వోట్ల ద్వారా మద్దతు తెలిపిన ప్రజలు
ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ
ప్రజాస్వామ్యం గెలిచిందన్న అధ్యక్షుడు ఖర్గే
న్యూదిల్లీ, జూన్‌ 4 : దేశ ప్రజలు మోదీని ఓడిరచారని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఫలితాలపై తన మొదటి స్పందనను తెలియజేశారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదని అన్నారు. మోదీ, అమిత్‌షాలు వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై రాహుల్‌ గాంధీఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నిల్లో మోదీతో పాటు అదానీ కూడా ఓడిపోయారని సెటైర్లు వేశారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు తాము పోరాటం చేసినట్టు స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఐకమత్యంతో పని చేసిందని వెల్లడిరచారు.

ఈ ఎన్నికల్లో తాము పోరాడిరది కేవలం బీజేపీతోనే కాదని, ఎన్నో సంస్థలతో పోరాటం చేయాల్సి వొచ్చిందని, ఈ దేశ వ్యవస్థతో పోరాటం చేశామని, సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలతోనూ పోరాటం చేశామని అన్నారు. ఈ సంస్థలన్నింటినీ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా తమ గుప్పిట్లో పెట్టుకుని ఆడిరచారని విమర్శించారు. దేశ ప్రజలు మోదీని ఓడిరచారని, ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదని అన్నారు. బీజేపీ అహంకారంతో రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసిందని, దేశానికి ఇండియా కూటమి కొత్త విజన్‌ ఇచ్చిందని రాహుల్‌ గాంధీ అన్నారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మట్లాడుతూ.. బీజేపీ నేతలు పార్టీలను విడదీసి సీఎంలను జైలులో పెట్టారని విమర్శించారు. మోదీ, అదానీల మధ్య ఉన్నది అవినీతి బంధమని ఆరోపించారు. ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈడి, సీఐడీలను సొంత ప్రయోజనాలకు బీజేపీ వాడుకుందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రతి కార్యకర్త కష్టపడ్డారని అన్నారు. ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపుకోసం పనిచేశారన్న రాహుల్‌ వారందరికీ అభినందనలు తెలిపారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలకు మల్లి కార్జున ఖర్గేఖర్గే కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని తెలిపారు. భారత్‌ జోడో న్యాయ యాత్ర పార్టీకి ఎంతో ఉపయోగపడిరదని అన్నారు. తమతో కలిసి నడిచిన అన్ని పార్టీలకు అభినందనలు అని అన్నారు. ఐక్యమత్యంతో మంచి ఫలితాలను సాధించామని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదని ..ఇది మోదీ పరాజయం అని విమర్శించారు. వ్నిడియా సామవేశంలో సోనియా, జైరామ్‌ రమేశ్‌ కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *