నిజానికి రైతులకు ఎంత ఉచిత విద్యుత్ అవసరమో లెక్కలేదు. ఎవరికి ఎంత పొలం ఉంది..వారికి ఎంత విద్యుత్ అవసరం..వారు ఏ పంటలు పండిస్తున్నారో లెక్కలు తీయాలి. ఉచిత విద్యుత్ పొందుతున్న వారిలో ఎందరు పంటలు పండిస్తున్నారు.. ఏ పంటలు పండిస్తున్నారు..అన్న లెక్కలు కూడా లేవు. కొందరు ఇతరత్రా పనులకు ఉచిత విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఉచిత విద్యుత్‌ను కూడా లెక్కగట్టి ఇవ్వాలి. ఏ పంట పండిస్తారో చూడాలి. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులతో విద్యుత్ కొని ఇస్తున్నప్పుడు దానికి లెక్కా పత్రం ఉండాలి. ప్రజలను ఆదుకోవడం వేరు..వోటు బ్యాంక్ రాజకీయాల కోసం పథకాలను అమలు చేయడం వేరన్న పద్దతి లో పాలన సాగాలి.
అప్పులు చేసి అభివృద్ది చేస్తున్నామన్న పాలకుల ధోరణి కారణంగా ..ఏటేటా రాష్టాల్ల్రో అప్పుల మూట పెరుగుతోంది. కొత్తకొత్త పథకాలతో ప్రజలకు దోచిపెడుతూ దానకర్ణుడిలా గొప్పుల చేసామని తెలుగు వల్లభులు చాటుకుంటున్నారు. చేతికి ఎముక లేదన్నట్లుగా పథకాలతో ఖజానాను ఊడ్చేస్తున్నారు. ఇదంతా అభివృద్దిగా చూపుతూ..దేశమంతా ఇదే పాటించాలన్న డిమాండ్‌ను పెడుతున్నారు. ఉచిత విద్యుత్‌పై ఇలాంటి వ్యాఖ్యలే ఇప్పుడు ఆందోళనలకు కారణం అవుతోంది. నిజానికి రైతులకు ఎంత ఉచిత విద్యుత్ అవసరమో లెక్కలేదు. ఎవరికి ఎంత పొలం ఉంది..వారికి ఎంత విద్యుత్ అసవరం..వారు ఏ పంటలు పండిస్తున్నారో లెక్కలు తీయాలి. ఉచిత విద్యుత్ పొందుతున్న వారిలో ఎందరు పంటలు పండిస్తున్నారు.. ఏ పంటలు పండిస్తున్నారు..అన్న లెక్కలు కూడా లేవు. కొందరు ఇతరత్రా పనులకు ఉచిత విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఉచిత విద్యుత్‌ను కూడా లెక్కగట్టి ఇవ్వాలి. ఏ పంట పండిస్తారో చూడాలి. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులతో విద్యుత్ కొని ఇస్తున్నప్పుడు దానికి లెక్కా పత్రం ఉండాలి. ప్రజలను ఆదుకోవడం వేరు..వోటు బ్యాంక్ రాజకీయాల కోసం పథకాలను అమలు చేయడం వేరన్న పద్దతి లో పాలన సాగాలి. రైతుబంధు కావొచ్చు…ఇతర పథకాలు కావొచ్చు..దుబారాను అరికట్టాలి.సంవత్సరం మొత్తం కష్టపడే రైతు తనకు ఉచితంగా ఏదీ వొద్దంటున్నాడు …తను పండించిన పంటకు న్యాయమైన ధర చెల్లించమంటున్నాడు ..స్వామినాథన్ కమిషన్ కూడా అదే సిఫారసు చేసింది ..కానీ మన పాలకులు కార్పొరేట్ లకు ,దలారీ లకు బాంచన్ గిరి చేస్తూ ఉచితాల పేరుతొ రైతు కు అన్యాయం చేస్తున్నారు. దూరదృష్టి లేకుండా పథకాల పేరుతో దుబారా చేస్తే నష్టపోయేది రాష్ట్రం..ప్రజలే అని గుర్తించాలి. రూపాయికే కిలో బియ్యం అన్నది అర్థం లేని పథకంగా ఇప్పటికే గుర్తించాల్సింది. అయినా దానిని సక్షించడం లేదు. ఇలాంటి పథకాలు గుదిబండగా మారుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే దలారీలకు దందాలు చేసే పథకంగా మారింది. గతంలో శ్రీలంక ఎదుర్కొన్న ఆర్థిక దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వొచ్చే ప్రమాదం రాకుండా చూసుకోవాలి. ఒక్క కుటుంబం చేతిలోనే అధికారం కేంద్రీకృతం కావడం…అందులో మిగతా మంత్రులకు భాగస్వామ్యం లేకుండా పాలన సాగడం వంటి కారణాల వల్ల శ్రీలంక దివాలా తీసింది. దేశ సంపదను కొల్లగొట్టి, ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసి ఆర్థిక మాంద్యానికి కారణమయిన శ్రీలంక పరిస్థితి నేతలకు కనువిప్పు కావాలి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్ర వల్లభులు దీనిపై పాఠాలు నేర్చుకోవాలి. జీతాలకు ఇవ్వలేక, అభివృద్ధి పనులు చేపట్టలేక, ఉన్నది ఉచితంగా దోచిపెడుతూ తామేదో ఘనకార్యం చేస్తున్నామనుకుంటున్న కెసిఆర్, జగన్‌లు కళ్లు తెరవాలి. పథకాల కోసం కొత్తగా డబ్బుల వేట మొదలు పెట్టడం, అప్పులు చేయడం సరైనపని కాదని గుర్తించాలి. ఉన్న అప్పులను తీర్చడమెలా అన్నది పక్కన పెట్టి కొత్త అప్పులు చేయడమెలా అన్నదానిపైనా పాలకులు దృష్టి పెట్టడం దారుణం కాక మరోటి కాదు. పాలన అంటే పంచిపెట్టడం కాదని గుర్తించాలి. నగదు బదిలీలతో ప్రజలను మచ్చిక చేసుకుని వోటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ కుటుంబం గుప్పిట్లో అధికారాన్ని ఉంచుకుని చేస్తున్న యత్నాలు విరమించుకోవాలి. ఉచిత పథకాలపై నెత్తీనోరు మొత్తుకుంటున్నా ఇద్దరు సిఎంలు వాటిని ఆపాలని ప్రయత్నించడం లేదు సరికదా అదేదో మహత్కార్యం చేసినట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఉభయ తెలుగు రాష్టాల్ల్రో ఉచిత పథకాలపై కత్తెర వేయాలి. డబ్బుల పంపిణీని ఆపాలి. మరీ ముఖ్యంగా దుబారా పథకాలపై సక్షించాలి. లేకుంటే నిజంగానే శ్రీలంక కన్నా దారుణ పరిస్థితులు ఏర్పడగలవు. ప్రజలు కూడా దోచిపెట్టినంత కాలం తింటారు. ఉపద్రవం ముంచుకొస్తే తిరగబడతారనడానికి శ్రీలంక చక్కని ఉదాహరణ. ఏడాది క్రితం శ్రీలంక నేర్పిన పాఠం నుంచి మనమంతా గుణపాఠం నేర్వాలి. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బులను పందేరం చేస్తున్న కెసిఆర్,జగన్‌లు కళ్లు తెరవాలి. ఇబ్బడి ముబ్బడిగా పోటీపడి కొనసాగిస్తున్న ఉచిత పథకాలను రద్దు చేయాలి. రైతుబంధు పేరుతో డబ్బున్న వారికి పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని తక్షణం ఆపాలి. రైతుబంధు, రైతుల రుణ మాఫీలు, ఉచిత్ గొర్రెల పథకం, దళితబంధు వంటి పథకాలను తక్షణం సక్షించాలి. వీటి గురించి గొప్పలు చెప్పడం మానుకోవాలి. జగనన్న పథకాలపైనా సక్షించాలి. అవి ఎంతమంచివైనా అర్హులకు సాయం అందించడంలో తప్పు లేదు. కానీ దుబారా పథకాలను కొనసాగిస్తే ప్రజలు ఊరికే వొచ్చిన వాటిని తింటారు. తరవాత తిట్టడానికి కూడా వెనకాడరు. విపక్షాలు కూడా ఈ పథకాలపై చర్చించి దుబారాను అరికట్టాలని కోరాలి. లేకుంటే వారు కూడా ఇందుకు బాధ్యతులు కాగలరు. జగనన్న పేరుతో చేస్తున్న దుబారాలను అరికట్టాలి. నగదు బదిలీలతో బొక్కసం ఖాలీ చేయడం ఆపాలి. రూపాయికి కిలో బియ్యం, ఉచిత విద్యుత్, రైతుబంధు, జగనన్న పథకాలు ఇలా ఒక్కోటి చెప్పుకుంటూ పోయే బదులు ఒక్కో పథకంలో ఎంతమంది పేదలు, అందులో అర్హులు ఉన్నారో లెక్కగట్టాలి. ప్రచారార్భాటాలు కాకుండా ప్రజలు తమంతగా తాము బాగుపడ్డామని చెప్పగలిగినప్పుడే సుపరిపాలన అందించిన వారం అవుతాం. ప్రజల కష్టాలను కొంతయినా తగ్గించగలిగే నిర్ణయాలు మాత్రమే కావాలి. ప్రజలకు నేరుగా డబ్బులు పందేరం అన్నది వారిని సోమరులను తయారు చేసే ప్రయత్నం మాత్రమే కాగలదు.బంగారు పళ్లెంలో అన్నం పెట్టాలని ఎవరూ కోరుకోవడం లేదు. అన్నం తినగలిగేలా, గౌరవంగా బతికేలా వారి జీవితాలకు అడ్డం పడకుండా నిర్ణయాలు తీసకుంటే అదే మేలు. అప్పుడే ప్రజలు స్వాగతిస్తారు. ఎసి గదుల్లో కూర్చుని నిర్ణయాలు చేయడం..అవి ప్రజలకు చేరుతున్నాయో లేదో గమనించకపోవడం కాదు. గ్రాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా చేసేందుకు అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అంతేగానీ కులాలు,మతాలు పేరుతో విభజించి పథకాలు అమలు చేయడం సరికాదు. బొక్కసం వెక్కిరించేలా అప్పులు చేయడం వల్ల భవిష్యత్ తరానికి తీరని దెబ్బ తగలగలదని గుర్తించాలి. ఉచిత పథకాలు దురదను గోకినంత హాయిగా ఉంటుంది. కానీ తరువాత వ్రణంగా మారుతుందని గుర్తించాలి. ఇప్పటికైనా సక్షించుకుంటే ప్రజలకు మేలు చేసినవారు అవుతారు.
-ప్రజాతంత్ర డెస్క్
——————-




