ప్రజలారా ఆలోచించి ఓటు వేయండి  బి ర్ స్ ని గెలిపించండి

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 24:  నియోజకవర్గంలోని పరుఖ్ నగర్ మండలం లోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం,ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీకి
 అయిదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండుగ లాంటిదని, కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఐదేళ్ల ప్రజల విలువైన భవిష్యత్తనీ అడ్డగోలుగా సంపాదించి వచ్చిన వాళ్లు అందరిని డబ్బు సంచులతో కొనాలని చూస్తున్నారనీ ప్రజలారా పారాహుషార్ అంటూ షాద్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు.ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల, దూసకల్, లింగారెడ్డి గూడ గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మరో విశిష్ట అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యకు మద్దతుగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలలో పాల్గొని టిఆర్ఎస్ శ్రేణులు తదితరులు మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు అని చెప్పి నట్టేట ముంచిందనీ ఎవరికైనా అనుమానం ఉంటే కర్ణాటక సరిహద్దు దగ్గరే ఉంది కాబట్టి స్వయంగా వెళ్లి తెలుసుకోవచ్చన్నారు. గత బీజేపీ పాలనలో 9 గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత 4, 5 గంటలు మాత్రమే ఇస్తుందనీ, తమ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని అక్కడి రైతులు చెప్తున్నరని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 గంటలు కరెంట్ చాలు అంటున్నడని, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 5 గంటలు చాలు అంటున్నడనీ, 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ ఉండగా కాంగ్రెస్ ని నమ్మి మోసపోదామా? గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత కరెంట్ అని చెప్పి ఉత్తుత్తి కరెంట్ చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. రాత్రి పూట కరెంట్ ఇస్తే పాములు, తేళ్లు కరిచి, కరెంట్ షాకులు కొట్టి రైతులు చనిపోయింది వాస్తవం కాదా? కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలంటే కారుకే ఓటు గుద్దాలన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు దేవుడెరుగు కానీ ఆర్నెల్లకు ఒక సీఎం మారుడు మాత్రం పక్కా అని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే అంజయ్యకు పార్టీ శ్రేణులు ప్రజలు బ్రహ్మరథం పట్టారు మహిళలు విజయ తిలకాలు దిద్దుతూ మంగళ హారతులు పట్టారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున వందలాదిగా హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *