ప్రజలలోరోజురోజుకీ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 16: కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో రోజురోజుకీ ఆదరణ పెరుగుతుందని శేరీలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మేరకు గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పార్థికి చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గారెంటీ పథకాల పట్ల ఆకర్షితులైన అనేకమంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి ఈనెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసే విధంగా ప్రచారం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *