‌ప్రజలను గందరగోళంలో పడేస్తున్న మోదీ

• అత్యవసర పార్లమెంట్‌ ‌సమావేశాలపై అనుమానాలు
• వరంగల్‌ ‌పర్యటనలో బిఆర్‌ఎస్‌ ‌నేత వినోద్‌ ‌కుమార్‌

రంగల్‌,‌సెప్టెంబర్‌1: ‌ప్రధాని మోదీ ఇంత అత్యవసరంగా పార్లమెంట్‌ ‌సమావేశాలు  ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రణాళిక సంఘంఉపాధ్యక్షుడు వినోద్‌ ‌కుమార్‌ అన్నారు. మోదీ పేరు చెబితేనే ఓట్లు పడతా యని ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నాయకు లు అనుకుంటున్నారని విమర్శించారు. సమా వేశాల పేరుతో ప్రజలను గందరగోలంలో పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్నట్టు ండి సమావేశాలుఎందుకు పెడుతున్నా రని చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. వరంగల్‌ ‌పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌తో కలిసి హనుమకొండలోని భద్రకాళి అమ్మ వారినివినోద్‌ ‌దర్శించుకు న్నారు. దర్శనం అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వరంగల్‌ ‌భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. 2001లో టీఆర్‌ఎస్‌ ‌ప్రార ంభం రోజున గులాబీ జెండా అమ్మవారి వద్దకు తీసుకువ చ్చామని తెలిపారు.

అమ్మవారి ఆల యంలో పూజ చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్లడం ఒక సెంటి మెంటుగా వస్తుందన్నారు. అభివృద్ధి పరంగా దేశంలో తెలంగాణ మొదటి వరుసలో ఉందని చెప్పారు. సంక్షేమ పథకాల విష యంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వ్యవసాయంతోపాటు పరిశ్రమల ద్వారాలక్షలాది మంది ఉపాధి పొందు తున్నా రని వెల్లడించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని, గ్రాణ ప్రాంత ప్రజలను ఆర్థికంగా ఎదిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కృషి చేస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ‌మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా మంచి విజయం సాధించి కేంద్రంతో కొట్లాడి మనకు రావా ల్సినవి సాదించుకుందామని పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *