ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ‘ప్రజాతంత్ర’

డైరీ, క్యాలండర్‌ ఆవిష్కరించిన కాంగ్రెస్‌ పార్టీ హుజురాబాద్‌ నియోజకవర్గం ఇంచార్జ్‌ ఒడితల ప్రణవ్‌బాబు

జమ్మికుంట, ప్రజాతంత్ర, జనవరి17: ప్రజల సమస్యలను అక్షర రూపంలో ‘ప్రజాతంత్ర’ దినపత్రిక ద్వారా ప్రభుత్వానికి దర్పణంలా చేరవేయడం జరుగుతుందని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజాతంత్ర దినపత్రిక యాజమాన్యం పనిచేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ హుజురాబాద్‌ నియోజకవర్గం ఇంచార్జ్‌ ఒడితల ప్రణవ్‌బాబు అన్నారు. బుధవారం హుజురాబాద్‌ మండలంలోని సింగాపురం లోని ఆయన స్వగృహంలో 26వ వసంతాలు పూర్తి చేసుకుంటున్న ప్రజాతంత్ర దినపత్రిక క్యాలెండర్‌, డైరీలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను గుర్తించి వాటిని అక్షర రూపంలో మలిచి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ప్రజల రక్షణ ముందడుగు వేస్తున్న దినపత్రిక ప్రజాతంత్ర అని ఇదే తరహాలో ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి తెలియజేసేలా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా పత్రికా యాజమాన్యానికి ,సిబ్బందికి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పాత్రికేయులు గంగారపు రఘుబాబు, ప్రజాతంత్ర దినపత్రిక పాత్రికేయులు బుర్ర సత్యనారాయణ, రామ్మోహన్‌, కాంగ్రెస్‌ పార్టీ యువజన నాయకులు అన్నం ప్రవీణ్‌, పాతకాల అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *