‌ప్రజలంతా సుఖసంతోషాలతో వర్దిల్లాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 14 : దేశ, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ ‌సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకర  సంక్రాంతిని ప్రజలంతా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని కోరారు. ప్రతి ఇల్లు సిరిసంపదలతో నిండాలన్నారు.  ఒకప్పుడు సాగు దండగ అన్న తెలంగాణలో నేడు పండగ అయ్యిందని తెలిపారు. వ్యవసాయ ప్రగతిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులు తీసుకరావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయం పండగ అయినప్పుడే అసలైన సంక్రాంతి అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *