ప్రచారంలో వింత అనుభవాలు..

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 19 : కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ కు మద్దతుగా కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరత్ నాయక్, సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డిలు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థులకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి జైపాల్ యాదవ్ కారు గుర్తుకు ఓటు వేయాలని రైతులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వరి చేను కోతదశకు రావడంతో యంత్రంతో కట్ చేయిస్తున్నారు. వారు కూడా వ్యవసాయ కూలీలకు తోడుగా కొడవలితో వరి చేను కోసి యంత్రం ద్వారా ధాన్యాన్ని వేరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *