ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి అభ్యర్థి ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 3 :  బిజెపి అభ్యర్థి ఆచారి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఎన్నో ఉద్యమాలు చేసి ఐదు సార్లు పోటీ చేసి ఓడిపోయానని ఒక్కసారి అవకాశం ఇస్తే కల్వకుర్తి నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం ఆమనగల్లు మున్సిపాలిటీలోని మూర్తుజాపల్లి, విఠాయిపల్లి ,చంద్రయన్ పల్లి తాండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇంటి ఇంటికి గడపగడపకు తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండే హరిప్రసాద్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కండే సాయి, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, బిజెపి తాలూకా కోకన్వీనర్ గోరేటి నరసింహ, మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్, చెక్కల లక్ష్మణ్, కౌన్సిలర్లు. బిజెపి మండల తాలూకా గ్రామ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *