ప్రచారంలో దూకుడు పెంచిన బిజెపి అభ్యర్థి అందె బాబయ్య 

షాద్ నగర్ లో  గెలుపు దిశగా కమలం
షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 24:  అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన ఘనత.. ఐదు సార్లు ఎమ్మెల్యేలను గెలిపించిన చరిత్ర.. ఆయన ప్రత్యేకత.. అందుకే తన రాజకీయ అనుభవాన్ని రంగరించి ఎన్నికల్లో దూసుకుపోతున్నాడు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు దీటుగా వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రత్యర్థుల్లో దడ పుట్టిస్తున్నాడు. అతడి బిజెపి అభ్యర్థి అందె బాబయ్య. రాజకీయ అనుభవ శాలిగా పేరు ఉన్న ఆయన సుదీర్ఘకాలం తర్వాత బిజెపి అభ్యర్థిగా టికెట్ సాధించి చాపకింద నీరులా నియోజకవర్గంలో అల్లుకుపోతున్నాడు. ఓటర్లను తన వైపుకు తిప్పుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. పెద్దలైతే నోరార అన్నా అని, చిన్నోళ్ళయితే “తమ్మి” నేను మీ బాబన్న అంటూ అందరిని ఆప్యాయంగా కలుపుగోలుగా పలకరిస్తూ పల్లె ప్రజల గుండెల్లో హత్తుకుపోతున్నాడు బాబన్న.  “నేడు” దినపత్రిక ప్రత్యేక కథనంలో ఒక్కసారి ఆయన రాజకీయ ప్రస్తానాన్ని, వర్తమానాన్ని పరిశీలిస్తే..
1983లో ఎన్టీ రామారావు ఒక ప్రభంజనంలా తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు షాద్ నగర్ నియోజకవర్గం నుంచి పార్టీ సభ్యత్వం తీసుకున్న తొలి నలుగురిలో అందె బాబయ్య ఒకరు.అలా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన తనకున్న పలుకుబ సరైన గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ఈటల రాజేందర్ ఆ పార్టీ నుంచి బయటికి రావడంతో ఆయనతో పాటే అంది బాబయ్య కూడా బయటికి వచ్చారు. చివరికి కమలంపార్టీ ఈ రాజకీయ అనుభవశాలిని గుర్తించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా, ముదిరాజ్ ముద్దుబిడ్డగా ఆయా వర్గాలలో మంచి పేరున్న అందే బాబయ్యను అభ్యర్థిగా ఎంచుకుంది. టికెట్ కోసం ఎంతమంది పోటీపడ్డ సీనియర్ నేతగా, మంచి వ్యక్తిగా గుర్తింపు ఉన్న అందే బాబయ్య ముందు నిలబడలేకపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు పోటీగా ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *