సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: తెలంగాణ అస్తిత్వం.. సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శనివారం సిద్దిపేటలోని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ అస్తిత్వం బతుకమ్మ చిత్రాలను అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. అందరికి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ… ప్రపంచంలోనే ప్లవర్ ఫెస్టివల్ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక మైనది. సమాజంలో ఊరు ఊరంతా ఆడపడుచులు ఐకమత్యం తో కలసిమెలసి ఆటపాటలతో రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి సబ్బండవర్గాలు సంబరాలు జరుపుకొని తెలంగాణ సంస్కృతికి పుణరంకితమై అందరూ సుఖ సంతోషాలతో శాంతి సామరస్యంగా భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారు. ఆర్ ఏ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం, గ్రైట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రూబినారుస్తుం, మొహమ్మద్ సాధిక్, రహీంరుస్తుం, తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి పరిమళం సద్దుల బతుకమ్మ ఆవిష్కరించిన సుప్రసిద్ధ చిత్రకారుడు రుస్తుం





