తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: అతి తక్కువ ప్రీమియంతో 10 లక్షల ప్రమాద బీమా పాలసీని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బాలేశ్వర గుప్తా అన్నారు. సోమవారం యాలాల మండల కేంద్రంలో పోస్టల్ శాఖ ఏర్పాటు చేసిన ప్రమాద బీమా పాలసీ, బీమా పాలసీలపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోస్ట్ ఆఫీస్ లోను బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయన్నారు. పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో టాటా జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. యాలాల మండల కేంద్రంలో ఉన్న ఫోర్ వీలర్ లైసెన్స్ కలిగి ఆటో, కార్లు నడుపుకునే ప్రతి ఒక్కరికి తానే డబ్బులు చెల్లించి పాలసీని అందిస్తున్నానన్నారు. ఫోర్ వీలర్ డ్రైవింగ్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏడాదికి రూ.399 ప్రీమియం చెల్లిస్తే రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుందని, అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి లక్ష వరకు ఇన్సూరెన్స్ వస్తుందని ధవఖాన వైద్య ఖర్చులకు బీమా పాలసీ ఉపయోగపడుతుందని అన్నారు. పోస్టల్ శాఖ,టాటా జనరల్ ఇన్సూరెన్స్ సౌజన్యంతో తీసుకొచ్చిన ప్రమాద బీమా పాలసీని గ్రామీణ ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హెడ్ పోస్ట్ ఆఫీస్ లతోపాటు, గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో కూడా ప్రమాద బీమా పాలసీని తీసుకోవచ్చని తెలిపారు. అతి తక్కువ రూ.399 ప్రీమియంతో ప్రమాద బీమా రూ.10 లక్షల రూపాయలు ఇచ్చేది ఒక పోస్ట్ ఆఫీస్ ద్వారా టాటా జనరల్ ఇన్సూరెన్స్ ద్వారానే వస్తుందని ప్రజలందరూ దీనిని సద్వినియేగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ సూరజ్ సింగ్ రాజ్ వార్, ఐపిపిబి మేనేజర్ క్రాంతి,యాలాల ఎస్ పి ఎం ఫిరోజ్ బాబా, తాండూరు సబ్ డివిజన్ మెయిల్ ఓవర్సీస్ రాములు, తపల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


