పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 7 : కడ్తాల్ మండలంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని నిర్వాహకులకు సూచించారు. పనులను త్వరగా పూర్తిచేస్తే త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్, సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, ఆమనగల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు వెంకట్, హరి శంకర్ గౌడ్, డైరెక్టర్ లాయర్ అలీ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *