నివాళి అర్పించిన బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో, శాంతి భద్రతల నిర్వహణలో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలను ఎదుర్కొంటూ రాజీలేకుండా చేస్తున్న పోరాటంలో అసువులు బాసిన పోలీసు అమరవీరులకు జోహార్లు తెలిపారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
విధి నిర్వహణలో, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. నిత్యం ఒత్తిళ్ల నడుమ విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడుతున్న పోలీసులు, హోంగార్డుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు.




