పోలీసు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : ఆమనగల్లు మున్సిపాలిటీ 3వార్డు  నుచుగుట్ట తండాలో పోలీసు ఉద్యోగాలు సాధించిన 8 మంది అభ్యర్థులను యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కృష్ణా నాయక్ అభినందించారు. ఈసందర్భంగా అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత స్వగ్రామానికి తల్లిదండ్రులను మర్చిపోకుండా నీతి నిజాయితీతో పని చేయాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *