ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : పోలీస్ ఉద్యోగ పరీక్ష ఫలితాలలో స్నేహ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేహదారుడ్య శిక్షణ పొంది ఉద్యోగాలు పొందిన ఆమనగల్లుకు చెందిన పది మంది అభ్యర్థులను గురువారం స్నేహ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆమనగల్ కు చెందిన ఆమని (ఎక్సైజ్ కానిస్టేబుల్), మల్లిక (ఏ ఆర్ కానిస్టేబుల్), డయానా (ఏ ఆర్ కానిస్టేబుల్), సతీష్ (ఏ ఆర్ కానిస్టేబుల్), వి. శివ (టి ఎస్ ఎస్ పి కానిస్టేబుల్), గజ్జె శివ (ఏ ఆర్ కానిస్టేబుల్), మహేష్ (టి ఎస్ ఎస్ పి కానిస్టేబుల్), రవీందర్ (సివిల్ కానిస్టేబుల్),మరియు జంగారెడ్డి పల్లి కి చెందిన కడారీ మహేష్,(ఏ ఆర్ కానిస్టేబుల్),వగ్గు మల్లేష్ (టి ఎస్ ఎస్ పి కానిస్టేబుల్) లను స్నేహ హస్తం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్గొండ జిల్లా విజిలెన్స్ సిఐ గజ్జె చరమందరాజు, అధ్యక్షులు తల్లోజు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పెరికేటి యాదయ్య, ఉపాధ్యక్షుడు లింగంపల్లి ఆనంద్, సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సాధనలోవిజయం పొందిన అభ్యర్థులు తమ ఉద్యోగ సాధనలో తమకు ఎంతో తోడ్పాటునందించిన స్నేహ హస్తం ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు స్నేహ హస్తం ఫౌండేషన్ అభినందనలు




