పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)  సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రశాంత్ జె పాటిల్,  ముఖ్యఅతిథిగా పాల్గొని పోలీస్ గౌరవవందనం స్వీకరించి, తదనంతరం పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్, అడిషనల్ డీసీపీలు అందె శ్రీనివాసరావు, ఎస్ మల్లారెడ్డి, రామ్ చందర్రావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు సురేందర్ రెడ్డి, చంద్రశేఖర్, రవీందర్ రాజు, ప్రసన్న కుమార్, అమరుల పోలీస్ కుటుంబ సభ్యులతో అధికారులు సిబ్బంది కలిసి పోలీస్ అమర వీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు వేసి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆర్ఎస్ఐ  నిరంజన్ ఆధ్వర్యంలో స్మృతి పెరేడ్ గౌరవ వందనం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్  ప్రశాంత్ జె. పాటిల్
మాట్లాడుతూ పోలీసులు ప్రాణాలకు తెగించి ఎన్నో త్యాగాలు చేస్తూ వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, శాంతిభద్రతలను ప్రజలకు సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగడానికి శాంతిభద్రతలు చాలా ముఖ్యమని శాంతిభద్రతల విషయంలో 24 గంటలు విధులు నిర్వహిస్తూ వారి జీవితాలను ప్రజలకు అంకితం చేస్తున్నారని పోలీసు పాత్ర సమాజానికి చాలా ముఖ్యమని ప్రతిక్షణం ప్రజల అవసరాల గురించి నిరంతరం పనిచేస్తున్నారని,  ప్రజలకు ప్రజల ధన మాన రక్షణ గురించి నిరంతరం పని చేస్తున్న పోలీసులను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని, పోలీసుల క్రమశిక్షణ భారతదేశ రక్షణ ప్రజాస్వామ్య విలువలు కాపాడడంలో ఎనలేని కృషి చేస్తున్నారని, సిద్దిపేట జిల్లాలో విధి నిర్వహణలో అమరులైన  పోలీసుల కుటుంబ  సభ్యులకు  ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తరఫున ఎప్పుడు అండగా నిలుస్తామని తెలిపారు.మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. సఖి షీ టీమ్, భరోసా, సెంటర్ల ద్వారా మహిళలకు పిల్లలకు ఎన్నో రకాల సేవలు అందించడం జరుగుతుందన్నారు. పోలీస్ వ్యవస్థలో ఎన్నో పెను మార్పులు వచ్చాయని,  పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ, పోలీసింగ్ ద్వారా  ప్రజలకు చేరువై సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ శ్వేత  ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ… పోలీస్ అమరవీరుల  దినోత్సవం 21 అక్టోబర్ 1959 లో యస్ఐ కరీంనగర్ 20 మంది జవాన్లు కలసి లడక్ ప్రాంతంలో హాట్ స్రింగ్  విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ వారి పై దాడి చేసి 10 మందిని హతమార్చినారు. అప్పటి నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణ లో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్-21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుండి ప్రారంభమైనదని అన్నారు.అమరులైన పోలీసుల జీవితాలనే మనం మార్గదర్శకంగా, ఆదర్శంగా మలుచుకుంటు ప్రజాసేవకు, ప్రజల ధన, మాన‌, ప్రాణాల రక్షణకు పునరంకితం కావడం. ఉగ్రవాదం, తీవ్రవాదం‌, మతతత్వం వంటి విఛ్ఛిన్నకర శక్తులతో నేరాలకు గోరాలకు‌ పాల్పడే అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాడవలసి రావడంతో పోలీసు ఉద్యోగం కత్తిమీద  సాములాగ ఎంతో ప్రమాదకరంగా పరిణమించింది. ఈ దశలో త్యాగాలకు భయపడకుండా వెనుకడుగు వేయకుండా రెట్టించిన సమరోత్సాహంతో అసాంఘిక శక్తులతో పోరాడి విజయాన్ని సాధించాలి. పోలీసులు త్యాగం చేయని రోజు అంటు ఉండదు. సెలవులు, పండుగ దినాలు, అధిక గంటలు పని చేయవలసి రావడం, ఆరోగ్యన్ని సైతం నిర్లక్ష్యం చేసి, అవిశ్రాంతంగా పని చేయడం వంటివి కూడా త్యాగలే, త్యాగాలు చేసే వారికి ఇంకా గుర్తంచడం లేదు. ఆరోజు కోసం మనమంతా ఎదురుచూద్దాం. ఈ సంవత్సరంలో మన దేశంలో విధినిర్వహణలో (189) మంది వీరమరణం పొందినాడు వీరమరణం పొందిన వారందరికీ మనమందరం శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలిపినారు.
గతములో సిద్దిపేట జిల్లా పరిధిలో విధి నిర్వహణలో  వీరమరణం పోందిన త్యాగమూర్తులు1. యాదగిరి సి.ఐ.( రామవరం హుస్నాబాద్),
2. జాన్ విల్సన్ యస్ఐ (రామవరం హుస్నాబాద్), 3.రాజగోపాలచారి యస్ఐ (దౌల్తాబాద్),4. చంద్రయ్య హెచ్.సి. 156,(దౌల్తాబాద్),5. రాంమూర్తి పిసి 2173, కొండాపూర్ మద్దూర్,7.ప్రకాష్ సింగ్ పిసి, 956, సింగరాయికొండ కోహెడ,వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను అందజేయడం  కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమర వీరులకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. పోలీసులు చేస్తున్న అత్యున్నత త్యాగాలను సమాజం గుర్తుంచుకొనే విధంగా ప్రముఖ దిన పత్రికలలో ప్రకటనలు, బ్యానర్లు,  కమిషనరేట్ నందు, పోలీసు స్టేషన్ లలో ఓపెన్ హౌజ్ కా‌ర్యక్రమము,వ్యాసరచన పోటీలు, రక్త దాన శిబిరాలు, కొవ్వొత్తి ర్యాలీలు, తదితర కార్యక్రమాలు ఈ నెల 31 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.పోలీస్ కమిషనర్, కలెక్టర్ కలసి అమరుల కుటుంబ సభ్యులను పేరు పేరునా పరామర్శించచి చిరు కానుకలు అందజేశారు. ప్రభుత్వం తరఫున వస్తున్నా సంక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అమర పోలీస్ కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా 2023 సంవత్సరంలో విధినిర్వహణలో మరణించి అమరులైన 189 మంది అధికారుల సిబ్బంది పేర్లు అడిషనల్ డీసీపీ అడ్మిన్  అందె శ్రీనివాసరావు చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు అందె శ్రీనివాసరావు, ఎస్ మల్లారెడ్డి, రామచందర్రావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు సురేందర్ రెడ్డి, చంద్రశేఖర్, రవీందర్ రాజు, ప్రసన్నకుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి,ఇన్స్పెక్టర్లు  కృష్ణారెడ్డి, భాను ప్రకాష్, రవికుమార్, చేరాలు,రామకృష్ణ, గురుస్వామి,ధరణి కుమార్, పూర్ణచందర్, రాజేష్, ప్రసాద్, ఎస్ఐలు కిరణ్ రెడ్డి, నిరంజన్, సురేష్, సాయి ప్రసాద్, రోహిత్, రంజిత్ రెడ్డి, శ్రీకాంత్, అమర పోలీస్ కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *