తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: ఎన్నికల కోడ్ అమలులో భాగంగా పోలీసులు చేపట్టిన తనిఖీలలో రూపాయలు 2.50 వేలు నగదును పట్టుకున్నారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో విలేమున్ చౌరస్తాలో పోలీసులు చేపట్టిన తనిఖీలలోబైక్ పై తరలిస్తున్న రూ 2.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ప్రారంభం కావడంతో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ మేరకు ఇట్టి నగదును స్క్రీనింగ్ కమిటీ సభ్యులకు అందజేస్తున్నట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు, నగదుకు సంబంధించి సరైన ధ్రువపత్రాలను సమర్పిస్తే నగదుకు సంబంధించి సరైన పత్రాలు సమర్పిస్తే అట్టి నగదును తిరిగప్పగిస్తామని పట్టణ సిఐ తెలిపారు.
పోలీసుల తనికీలలో రూ.2.50 నగదు పట్టివేత



