పోలీసులు తనిఖీల్లో రూ. 40 లక్షల పట్టివేత

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 21: ఎన్నికల్లో నిబంధనలో భాగంగా చేపడుతున్న తనిఖీలలో భారీగా నగదు రూ. 45 లక్షలు పోలీసులు పట్టుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. తాండూరు పట్టణ సిఐ రాజేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పోలీసులు తనిఖీలు చేపడుతుండగా  పెద్దెముల్ మండలం మారేపల్లి లోని సుమిత్ర కాటన్ మిల్లుకు చెందిన వినయ్ గార్గ్, వీరారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు రూ. 40 లక్షలను రెండు బ్యాగుల్లో తీసుకు వెళుతున్నట్లు గుర్తించి అట్టి నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ నగదును ఎక్కడికి తరలిస్తున్నారని విషయంపై ఆరాతీస్తున్నట్లు చెప్పారు . ఇట్టి నగదు ను స్క్రీనింగ్ కమిటీ సభ్యులకు సీజ్ చేసిన నగదును అప్పగించినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *