ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 1 : అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి కల్వకుర్తి నియోజకవర్గం లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒక్క నిమిషం విరామం లేకుండా ప్రచారంలో మునిగితేలారు. బిజీ బిజీగా గడిపారు.. తీరా నవంబర్ 28న ప్రచారం ముగిసింది. తదనంతరం నవంబర్ 30న ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో కాంగ్రెస్, బిజెపి బిఆర్ఎస్ అభ్యర్థులు తమ తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తూ గడిపారూ.. శుక్రవారం ప్రజాతంత్ర వారిని పలకరించగా బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి ఆమనగల్లులోని పార్టీ కార్యాలయంలో తన కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్ లోని తన స్వగృహంలో భార్య మాధవి తో కలిసి భోజనం చేస్తూ ఇలా కెమెరాకు చిక్కారు. బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ తన స్వగృహంలో పేపర్ చదువుతూ ఇలా కాలక్షేపం చేస్తూ గడుపుతున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపుతో వీరి జాతకాలు బయటపడటంతో ఎన్నికల ఆట ముగుస్తుంది. ఇక గెలిచేది ఎవరో ఒకరు… ప్రజాక్షేత్రంలో తిరుగుతూ నియోజకవర్గ అభివృద్ధికి అంకితమవుతామంటున్నారు.
పోలింగ్ ముగిసింది ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇలా గడిపారు



