పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు త్వరితగతిన ఏర్పాటు చేయాలి కలెక్టర్ భారతి హోలీకేరీ

రంగారెడ్డి జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 3:  కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోలీకేరీ సేక్టోరల్ అధికారులతో పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు జిల్లాలోని ఎనిమిది నియోజక వర్గాల పోలింగ్ కేంద్రాలలలో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి,భద్రతా
 సిబ్బందికి, ఉద్యోగులకు అవసరమైన త్రాగునీరు, విద్యుత్ సరఫరా, ర్యాoపులు, ఫర్నీచర్, టాయిలెట్స్ వసతులను త్వరితగతిన పూర్తి చేయాలని, పట్టణ కేంద్రాలలో మునిసిపల్ అధికారులు అవసరమైన వసతులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏ పోలింగ్ కేంద్రం వద్ద ఏమేమి వసతులకు ఆస్కారం ఉందో నివేదికలు సమర్పించాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాoపులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, పంచాయతీ ఇంజనీరింగ్ వారు వాటి ఏర్పాటు పై చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుశిందర్ రావు, సేక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *