గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసిన ప్రతిపక్ష పార్టీల నేతలు
హైదరబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : పోడుభూములకు పట్టాలు ఇవ్వాలనీ, ఆదివాసీలపై, అడివి ప్రాంతంలో రైతులపై ఫారెస్టు, పోలీసు దాడులను ఆపాలనీ, కోయపోశగూడెం, పాల్వంచ, అడివి రామవరం తదితర ప్రాంతాల్లో ప్రజలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనీ కోరుతూ మంగళ వారం మంత్రి సత్యవతి రాథోడ్ ను ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మినిష్టర్ క్వార్టర్స్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరావు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, సీతక్క(కాంగ్రెస్), జూలకంటి రంగారెడ్డి, బండారు రవి కుమార్, (సీపీఎం), వేములపల్లి వెంకట్రామయ్య, జెవి చలపతిరావు (న్యూడెమోక్రసీ), పోటు రంగారావు, గుమ్మడి నర్సయ్య(ప్రజా పందా), బాల మల్లేష్(సీపీఐ),శ్రీరామ్ నాయక్ తదితరులున్నారు.




