పైసలిస్తావా..కూల్చేయ్యాలా..?

  • అక్రమ వసూళ్ళలో దూకుడు పెంచిన టీపీఓ
  • లబోదిబోమంటున్న బాధితులు..
  • గాజులరామరం సర్కిల్‌ ‌లో గందరగోళం..!

కుత్బుల్లాపూర్‌ ‌ప్రజాతంత్ర అక్టోబర్‌ 11: అ‌క్రమ వసూళ్లకు అలవాటు పడిన అధికారులు ఎంతటికైనా దిగజారుతున్నారు. జీహెచ్‌ ఎం‌సీ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తరచూ పలు దినపత్రికలో ప్రచారం జరుగుతు న్నప్పటికీ  స్థానిక జీహెచ్‌ఎం‌సీ టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులు మాత్రం ససేమిరా తగ్గేదే లేదు అన్నట్లుగా అక్రమ వసూళ్ళలో మునిగితేలుతున్నారనే విమర్శలు వెల్లువెత్తు తున్నా యి. అక్రమ నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వాటిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి అక్రమ పద్ధతులను అవలంబిస్తూ అందిన కాడికి దోచుకుం టున్నారు.దీనితో స్థానికప్రజలు గోస వెళ్లబుచ్చుకుం టున్నారు.తాజాగా స్థానిక నియోజకవర్గ పరిధిలోని గాజులరామరం సర్కిల్‌, ‌జగద్గిరిగుట్ట చర్చి రోడ్డు నందు గల ఓ భవన నిర్మాణం వద్ద స్థానిక టౌన్‌ ‌ప్లానింగ్‌ ‌సెక్షన్‌ అధికారిని తమ సిబ్బందితో కలిసి లక్ష రూపాయలు వసూలు చేసినట్లు సదరు బాధితురాలు స్థానిక కార్పొరేటర్‌ ‌వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నది. ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ స్థానిక టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులు సొమ్ముచేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.

ఈతతంగమంతా చూస్తుంటే, స్థానిక  మున్సిపల్‌ ‌పరిధిలో టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారుల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరుకాయలుగా సాగుతోందని చెప్పవచ్చు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు బాధ్యత మరిచి ముడుపుల మాయలో ఊగుతూ ఉన్నారని చెప్పడానికి ఆయా ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చూస్తే కళ్ళకు కట్టినట్ల కనిపిస్తుంది.  అధికారుల పుణ్యమా అని అక్రమా లకు నిలయంగా స్థానిక  పట్టణ ప్రణాళిక విభాగం మారిందని చెప్పవచ్చు. ముడుపుల మత్తులో అక్రమాలకు జోరు పెరిగినట్లుగా చెప్పుకోవచ్చు.. సంబంధిత అధికారులు అమ్యా మ్యాలకు అలవాటు పడి,టౌన్‌ ‌ప్లానింగ్‌ ‌పనులు గాలికి వదిలే• •నట్లుగానే  కనిపిస్తుంది.. ఇక్కడ జరిగే తతంగం చూస్తుంటే. స్థానిక మున్సిపల్‌  ‌పరిధిలో అక్రమంగా, లేదా సక్రమంగా ఏది చేసినా అడిగే దిక్కు లేకుండా పోయిందని స్థానిక ప్రజలు విమర్శించుకుం టున్నారు.

ఇక్కడ జిహెచ్‌ ఎం‌సీ  కార్యాలయంలో పేరుకు మాత్రం టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులు ఉంటారు.. కానీ, అక్రమ రాబడికి అలవాటు పడిన వారు కుర్చికే పరిమితం కావడం పలువురుని విస్మసనీయనికి గురిచేస్తోంది. స్థానిక సర్కిల్‌ ‌పరిధి లోని జరుగుతున్న అక్రమాలను వారే దగ్గరుండి నడిపిస్తున్నాడనే వినికిడి గట్టిగానే విని పిస్తోంది. సర్కిల్‌ ‌పరిధిలో జరుగుతున్న అక్రమాల విషయమై పలుసార్లు పిర్యాదు చేసినప్పటికీ ఇక్కడి ఉన్నత అధికారి స్థానంలో ఉన్న టౌన్‌ ‌ప్లానర్‌ ‌స్పందించ కపోవడం ఏంటని ఫిర్యాదు దారులు వాపోతున్నారు.

ఇక్కడ ప్రయివేటు వ్యక్తులు అక్రమ నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయలు దండుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నా.. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో స్థానిక మున్సిపల్‌ ‌పరిధిలోని పాలన పక్కదారి పడుతోంది. పలు సమస్యలపై కార్యాలయానికి వచ్చిన పలువురు సమస్యలు పరిష్కారం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే వినికిడి ఆయా ప్రాంత వాసుల్లో చర్చనీయాంశంగా మారింది. దీనితో ప్రజలు కార్యా లయం నుండి వెనుదిరుగుతున్నారు. ఇప్పటికైనా, జీహెచ్‌ఎం‌సీ కమీషనర్‌, ‌జోనల్‌ ‌కమీషనర్‌ ‌మరియు ఉన్నతాధికారులు  స్పందించి స్థానిక మున్సిపల్‌ ‌పరిధిలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఆయా ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *