పేరు మార్చుకున్న రోజే రాష్ట్రంతో తెగిపోయిన టిఆర్‌ఎస్‌ బంధం

ఉప్పల్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : బిఆర్‌ఎస్‌ పార్టీగా పేరు మార్చుకున్న రోజే టిఆర్‌స్‌కు పార్టీకి తెలంగాణ ప్రజలకు మధ్య సంబంధం తెగిపోయిందని, బర్కత్‌ లేకుండా పోయిందని, ఆ పార్టీకి వోటు వేస్తే మురికిగుంటలో వేసినట్టే అని మల్కాజిగిరి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.  బుధవారం ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గం మౌలాలి హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే ఎన్వీ.ఎస్‌.ఎస్‌ ప్రభాకర్‌ ఎంబీసీ కార్పోరేషన్‌ మాజీ చైర్మన్‌  తాడూరి శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ చేతన హరీష్‌, బండారు శ్రీవాణి వెంకటరావు, నియోజకవర్గ కన్వీనర్‌  బాలచందర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఈటల మాట్లాడుతూ…అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ మీద కోపంతో వోటు వేశారు తప్ప రేవంత్‌ రెడ్డిని, ఆపార్టీ హామీలని చూసి ప్రజలు వోటు వేయలేదని అన్నారు. రేవంత్‌ రెడ్డికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా మోసపు హామీలు ఇచ్చి అధికారంలోకి వొచ్చారని, కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రజల్లోకి వొచ్చి మాట్లాడడం లేదని, మాట్లాడితే వారి కెపాసిటీ ఏంటో తెలిసి పోతుందని వొస్తలేరని ఆయన విమర్శించారు. దొంగతనంగా రాత్రి పూట నాయకుల ఇళ్లకు పోయి లక్షలు ఇచ్చి కొంటున్నారని, నాయకులు పోతుండవచ్చు కానీ నాయకులు అంతా ఒకవైపు ప్రజలంతా ఒకవైపు అవుతారన్నారు. ఆసేతు హిమాచలం మోదీ  ప్రధాని కావాలని కోరుతున్నారన్నారు.

ఇంకో జన్మఎత్తినా రాహుల్‌ ప్రధాని కాలేరని ఈటల అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ప్రాంతానికి అనేక సార్లు వొచ్చానని, ఆర్థిక మంత్రిగా, ఆరోగ్యమంత్రిగా తాను చేసిన పని చూశారని అన్నారు. మోదీ  మళ్ళీ ప్రధాని కావాలని దేశమంతా ముక్తకంఠంతో చెప్తున్నారని, ప్రధాని మొదటి ఎన్నికల శంఖారావం ఇక్కడే మొదలుపెట్టారని, మనం చూపించిన ప్రేమకు ఆయన ముగ్ధులయ్యారని, మల్కాజ్‌గిరి ప్రధానికి లోకల్‌ అయ్యిందని, నచ్చిందని, ఆయన ఇంప్రెస్స్‌ అయ్యారని, మల్కాజిగిరినీ గెలిపించి మోదీకి గిఫ్ట్‌ గా ఇద్దామని, అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ పార్‌లో మల్కాజిగిరి కూడా ఉండాలని కోరుతునానని ఈటల అన్నారు. గతంలో వోటింగ్‌ లో బస్తీల్లో ఉన్నవారు ఎక్కువ పాల్గొనేవారు కానీ, ఈసారి అపార్న్టె%డ%మెంట్స్‌లో ఉండేవారు కూడా ప్రేమతో వోటు వేయడానికి ముందుకు వొస్తున్నారని, 60 శాతం పైన పోలింగ్‌ జరగబోతుందని, తనకు భారీ మెజారిటీ రాబోతుందని, వందశాతం ఇక్కడ గెలిచేది బీజేపీనేనని రాజేందర్‌ ధీమా వ్య్తం చేశారు. నాయకులు పోతుండవచ్చునని, అయినా నాయకులు అంతా ఒకవైపు..ప్రజలంతా ఒకవైపు అవుతారన్నారు. కాంగ్రెస్‌ హామీల గురించి చెప్పాలంటే సమయం సరిపోదని, కేసీఆర్‌ మీద కోపంతో వేశారు తప్ప రేవంత్‌ రెడ్డిని చూసి ఆపార్టీ హామీలు చూసి వోటు వేయలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసికూడా మోసపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆనాడు రేవంత్‌ రెడ్డి మాట్లాడిన మాటలు ఈనాడు మాట్లాడుతున్న మాటలు చూడండి.

నేను సీఎం కాబోతున్న 2 లక్షల రుణమాఫీ చేస్తా ఎవరన్నా క్రాప్‌ లోన్‌ తీసుకోకపోతే వెంటనే బ్యాంకు కి వెళ్లి తీసుకోండి అని చెప్పారు. రుణమాఫీ, రైతుబంధు ఇవ్వకుండా రైతుల కళ్లలో మట్టికొట్టినవాడు రేవంత్‌ రెడ్డి. 500 బోనస్‌ ఊసే లేదు. పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఇప్పుడు 17 సీట్లు గెలిపించండి రాహుల్‌ ప్రధాని అయితే నిధులు తీసుకువొస్తా అంటున్నారు.  17 సీట్లు వచ్చేది లేదు నేను ఇచ్చేది లేదు అని చెప్పకనే చెప్తున్నారు. రేవంత్‌ రెడ్డి మళ్ళీ మోసం చేస్తున్నారు. చర్లపల్లిలో నాలుగువందల యాభై కోట్లతో యూరప్‌ దేశాల్లో మాదిరిగా రైల్వే స్టేషన్‌ తయారవుతుంది. ఒకప్పుడు రైల్వేస్టేషన్‌కి పోవాలంటే ముక్కుమూసుకొని పోయేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దేశంలో గతుకుల రోడ్లు లేవు..నూనె పోస్తే ఎత్తుకునే నున్నటి రోడ్లు మోదీ  అందించారు. గతంలో రోజుకు 11 కిలోమీటర్ల రోడ్లు వేస్తే ఇప్పుడు 33 కిలోమీట్లర్లు వేస్తున్నారు.  కేంద్రం తెలంగాణకు  2.5 లక్షల ఇళ్లు మంజూరుచేస్తే  కట్టలేని వాడు కేసీఆర్‌.  4 కోట్ల ఇల్లు కట్టించి ఇచ్చిన వారు మోదీ అయితే.. ఇస్తా  అని చెప్పి మోసం చేసినవాడు కేసీఆర్‌. వీళ్ళకు మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.  ఇంకో జన్మ ఎత్తినా కాంగ్రెస్‌ మళ్ళీ అధికారంలోకి రాలేరు. మీకు అండగా ఉన్న యూపీ లో గెలవలేక కేరళ పారిపోయారు. యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, బీహార్‌ లో దిక్కులేదు.

గెలిస్తే 40 సీట్లు గెలిచే మీరు.. రాహుల్‌ గాంధీ ఎలా ప్రధాని అవుతారు. ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు.  వారు డబ్బుని నమ్ముకున్నారు. వారి అభ్యర్థి ప్రజల్లోకి వచ్చి మాట్లాడడం లేదు.. మాట్లాడితే వారి కెపాసిటీ ఏంటో తీసిపోతుంది అని వస్తాలేరు. దొంగతనంగా రాత్రి పూట నాయకుల ఇళ్లకు పోతున్నారు. లక్షలు ఇచ్చి నాయకులను కొంటున్నారు. గతంలో కూడా అదే చేసారు. ఓడిపోయారు. మళ్ళీ అదే రీజల్ట్‌ వొస్తుంది. ప్రతి ఒక్కరూ బీజేపీకి మోదీకి వోటు వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  ఎన్వీ.ఎస్‌.ఎస్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ .. దేశంలో మోదీ హవా కొనసాగుతుందని, హౌసింగ్‌ బోర్డులో భూగర్భ డ్రైనేజ్‌ ఆధునీకరణ చేస్తామని, మినిగిపోతున్న మన కాలనీలను కాపాడుకుకోవాలంటే అది కేంద్ర నిధులతోనే సాధ్యం అవుతుందని, ఆ శక్తి రాజేందర్‌కి మాత్రమే ఉందని, మోదీ హయాంలో రైల్వేస్టేషన్లు విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ది చెందుతున్నాయని, మోదీ టీమ్‌లో ఈటల ఉండాలని కదం కదం కలుపుదాం కమలవికాసానికి కష్టపడదామని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *