పేదోడి భూమిపై పెద్దల కన్ను

పోలీసుల అండతో విలువైన భూ ఆక్రమణ
గిరిజన రైతుపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరింపు

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 22 : మహేశ్వరం మండలం మొహబ్బత్ నగర్ గ్రామానికి చెందిన కేతావత్ రవి అని గిరిజన రైతుకు చెందిన ఏడున్నర గుంటల విలువైన భూమిపై పెద్దల కన్ను పడింది. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఈ భూమి ఉండడమే కారణం. మొహబ్బత్ నగర్ గ్రామానికి చెందిన నల్లవోలు విద్యాసాగర్ రెడ్డికి సర్వే నెంబర్ 37లో వారసత్వంగా వచ్చిన ఏడున్నర గుంటల భూమి గ్రామానికి చెందిన కేతావత్ రవి కొనుగోలు చేసి అట్టి స్థలంలో కాంటైనర్ గది నిర్మించుకున్నాడు. దాని సమీపంలో సర్వేనెంబర్ 37లో చాంద్రాయణ గుట్టకు చెందిన చంద్రశేఖర్ ఇతరులు భూమి కొనుగోలు చేసి నిర్మాణ పనులు చేపట్టారు. జాతీయ రహదారిపై రవికి చెందిన భూమిపై వారి కన్ను పడింది. నయానో భయానో బెదిరించి రవి భూమిని కబ్జా చేయడానికి ఒత్తిడి తేవడంతో బాధితుడు పోలీసులను న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, మహేశ్వరం కోర్టు ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా చంద్ర శేఖర్ అనే వ్యక్తి మహేశ్వరం పోలీసుల అండతో బాధితుడు రవి భూమిని కబ్జా చేసుకుని కాంటైనర్ తొలగించి దౌర్జన్యానికి దిగడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు రవి తెలిపారు. ఈ భూతదాగాలో మహేశ్వరం పోలీసులు తల దూర్చి పదో , ఇరవేయ్యో లక్షలు తీసుకొని రాజీ కుదుర్చుకోవాలని రవి పై ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నాడు. రాజీ కుదుర్చుకోకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరిస్తున్నారని ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఆక్రమణదారుడు చంద్రశేఖర్ తో పాటు మహేశ్వరం పోలీసులతో తన కుటుంబానికి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, న్యాయం జరగని పక్షంలో కుటుంబంతో సహా పోలీస్ స్టేషన్ ముందు ప్రజల సంక్షేమంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నట్లు బాధితుడు రవి ఆవేదన వ్యక్తం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *