పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న సీఎం కేసీఆర్: డాక్టర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాసంత్ర ఆగస్టు 21: బీ.ఆర్.ఎస్.ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది అని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీసీ బంధు పథకం కోసం ఎంపిక చేసిన 300 మంది లబ్దిదారులకు 3 కోట్ల రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కులవృత్తులకు జీవం పోయడంతో పాటుగా ప్రతి కార్మికుడు కార్మికుడిగా మిగిలి పోకుండా యజమాని కావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నిరుపేద కుటుంబాలకు బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు.బీసీ బంధు పథకం ద్వారా బీసీలకు ఆర్ధిక సహాయం అందించడం అనేది ఇకపై నిరంతరం కొనసాగే ప్రక్రియ అని,దరఖాస్తుదారులు తమకు రాలేదని ఎవ్వరు నిరాశా నిస్పృహలకు లోనుకాకూడదన్నారు.మిగిలిన వారికి కూడా బీసీ బంధు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి,భవాని ప్రవీణ్,సాగర్ రెడ్డి,సామ తిరుమల రెడ్డి,సీనియర్ నాయకులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్,డేరంగుల కృష్ణ,డివిజన్ల అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,లింగాల రాహుల్ గౌడ్,శ్రీశైలం యాదవ్,చిరంజీవి,తోట మహేశ్ యాదవ్ మరియు నాయకులు సుర్వి రాజు గౌడ్,చంద్రశేఖర్ రెడ్డి మరియు పలువురు అధికారులు,నాయకులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *