పేదలకు బీమా సౌకర్యం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: బిఅర్ఎస్ ఎన్నికల హామీలో రేషన్ కార్డు కలిగిన పేదలకు బీమాసౌకర్యం కల్పిస్తామని హమి ఇవ్వడం పట్ల  స్వాగతిస్తున్నామని దళిత బహుజన ఫ్రంట్  జాతీయ కార్యదర్శి పి.శంకర్ తెలిపారు.సోమవారం రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హారీష్ రావును సిద్దిపేటలోని మంత్రి నివాసంలోడిబిఎఫ్ బృందం కలిసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ.. రైతు భీమా లాగా కూలీలకు ,పేదలకు భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు.ఇంటి యజామానికే కాకుండా  18 సంవత్సరాలు నుండి ప్రతి ఒక్కరికి వర్తింపచేయాలని,రైతు భీమా లాగా సహజ మరణానికి ఇవ్వాలని, వయోపరిమితి ని 65 సంవత్సరాలు పెట్టాలని కోరారు. దళితులకు మూడె ఎకరాల భూ పంపిణి  చెయాలని,దళిత బంధుకు పది లక్షల నుండి 25 లక్షలకు పెంచాలని,అంబేద్కర్ విద్యానిధి పధకానికి 20 నుండి 50 లక్షలకు పెంచాలన్నారు.దళితుల సంక్షేమం,అభివృద్ధి, రక్షణ చట్టాలను,పధకాలను సక్రమంగా అమలు చెస్తు దళితుల సమగ్ర అభివృద్ధి కి హమి పార్టీ ల మ్యానిపెస్టో లలో హమి ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమం లో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు దాసరి ఎగొండ స్వామి, చుంచు రాజేందర్, డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు,ఉపాధ్యక్షుడు భీమ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *