ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 2 :పేదంటి సొంతిటి వారి కళను నెరవేర్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మనకు అవసరమా అని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపల్ చైర్పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ ఆరోపించారు.గురువారం ప్రజాతంత్రతో మాట్లాడుతూ,2018లో కొంగర కలాన్ లో ఇల్లు లేని వారికి డబల్ బెడ్ రూమ్లు కట్టి ఇస్తున్నామని కల్లబొల్లి మాటలు చెప్పి శంకుస్థాపన చేసి రాత్రి రాత్రే శిలాఫలకాలను వాటిని తొలగించారని ఆమె ఆరోపించారు. 2019లో పటేల్ గూడ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లో మీద అందర్నీ పిలుచుకొని ప్రారంభం చేసుకున్నారని ఆమె తెలిపారు. ప్రజలందరినీ మోసం చేస్తూ కాలం గడుపుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఇప్పటికీ నియోజకవర్గంలో 15 సంవత్సరాల నుండి మూడు పర్యాయాలుగా ఉన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రజలందరినీ మభ్యపెడుతున్నారని ఆమె ఆరోపించారు.ఆయన చేస్తున్న పనునులను చూస్తున్నామని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.డబల్ బెడ్ రూమ్ లు వస్తున్నాయని చెప్పడం జరిగిందని ఎంతోమంది మునిసిపాలిటీ నుండి వందల దరఖాస్తులు పెట్టుకున్నారని నేటికీ అవి రాలేదని తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని వారిని మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.ఆదిభట్ల మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలో గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.తమ ప్రభుత్వ హాయంలో ఇచ్చిన ఇండ్ల స్థలాలు సైతం లాక్కుంటున్నారని ఆమె ఆరోపించారు.అలాంటి ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో మనకు అవసరమా అని ప్రజలకు తెలియజేశారు.సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలను ముందుగా ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు స్థలం లేని వారికి స్థలంతో పాటు ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు.ఈ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మల్ రెడ్డి రంగారెడ్డిని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె తెలిపారు.
పేదంటి వారి సొంతిటి కళను నెరవేర్చని మంచి రెడ్డి కిషన్ రెడ్డి





