పెట్టుబడిదారులే మా బ్రాండ్‌ అం‌బాసిడర్లు

తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ
సాఫ్రాన్‌ ఎయిర్‌ ‌క్రాప్ట్ ‌ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్‌ అం‌బాసిడర్లని సీఎం కేసీఆర్‌ అం‌టుంటారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ అమల్లో ఉందని స్పష్టం చేశారు. వొస్తున్న వారితో ఇతరులకు స్ఫూర్తి కలుగు తుందన్నారు. అందుకే తెలంగాణలో పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్నారు. శంషాబాద్‌లో సాఫ్రాన్‌ ఎయిర్‌‌క్రాప్ట్ ఇం‌జిన్‌ ఎంఆర్‌ఐ ‌ఫెసిలిటీని గురువారం మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..హైదరాబాద్‌లో మెగా ఏరో ఇంజిన్‌ ఎంఆర్‌ఓ ఏర్పాటుకు శాఫ్రాన్‌ ‌నిర్ణయించిందని తెలిపారు. హైదరాబాద్‌లో శాఫ్రాన్‌ ఏర్పాటు చేసే ఎంఆర్‌ఓ ‌ప్రపంచంలోనే పెద్దదని చెప్పారు. ప్రపంచస్థాయి సంస్థ భారత్‌లో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్‌ ఎంఆర్‌ఓ అని పేర్కొన్నారు. ఎంఆర్‌ఓ, ఇం‌జిన్‌ ‌టెస్ట్ ‌సెల్‌ ‌పెట్టుబడి దాదాపు రూ. 1200 కోట్లు అని తెలిపారు. 800 నుంచి వెయ్యి మంది దాకా ఉపాధి లభిస్తుంద న్నారు.

శాఫ్రాన్‌ ‌నిర్ణయం హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇతర సంస్థలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. విమాన రంగంలో కేంద్రం నుంచి తెలంగాణకు అనేక అవార్డులు వొచ్చాయని తెలిపారు. ఆవిష్కరణల కోసం టీ హబ్‌ ‌వంటి ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌, ‌పరిశ్రమల కార్యదర్శి జయేశ్‌ ‌రంజన్‌, ‌కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *