పెండింగ్ లో ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించింది

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27:  జిల్లాలో ఈ చాలన్ పెండింగ్ ఉన్న  వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించడం జరిగింది. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు తేదీ10-01-2024 లోపు సద్వినియోగం చేసుకోవాలి అడిషనల్ డిసిపి శ్రీనివాసరావు ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ  మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులు రాష్ట్ర ప్రభుత్వం  భారీరాయితీ ప్రకటించడం జరిగింది. ఈ అవకాశాన్ని వాహనదారులు  సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ చాలన్ డబ్బులు పెండింగ్ ఉన్న వాహనదారులు ఆన్ లైన్ ద్వారానే పెండింగ్ చలాన్ డబ్బులు చెల్లించాలి.ఈ చాలన్ సిస్టమ్ ద్వారా అన్ని  పెండింగ్ చలన్ లు చెల్లించాలి.ఆన్లైన్ అనగా ఫోన్ పే &
 పే టీం ఏం & గూగుల్ పే వంటి సేవలు ఉపయోగించుకోవచ్చు.లేదా మీ సేవ ఈ సేవ లో చెలించవచ్చు.తేదీ: 10-01-2024 వరుకు ట్రాఫిక్  చాలన్ లకు.రాయితీ వర్తిస్తుంది.ద్విచక్ర వాహనలకు 80% శాతం రాయితీ,ఆర్టీసీ బస్సులు ఆటోలకు, తోపుడు బండ్లపై  90% శాతం రాయితీ,నాలుగు చక్రాల వాహనాలకు, లారీలకు, భారీ వాహనాలకు  60% శాతం రాయితీచెల్లింపులు అన్ని ఆన్ లైన్ ద్వారా  చేసుకోవాలి.https://echallan.tspolice.gov.in/publicview/ తెలంగాణ ఈ చాలన్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులు 2023 డిసెంబర్ 26 నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు డిస్కౌంట్ చలానాల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వాహనాలపై ఎలాంటి జరిమానా లేకుండా చూసుకోవాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *