ఆశ్వయుజ మాసంలో వచ్చే
బతుకమ్మ తీరొక్క పువ్వులతో
రోజొక్క అలంకారముతో ముస్తాబై
ఎంగిలి పూల బతుకమ్మ మొదలు
సద్దుల బతుకమ్మ వరకు
ఆడపడుచులందరూ ఘనంగా జరుపుకునే
రాష్ట్ర పండుగ బతుకమ్మ

అమ్మ, అక్కలందరూ కలిసి
వాడ వాడనా బతుకమ్మ ఆట పాటలతో
తెలంగాణ సాంప్రదాయం ఉట్టి పడేలా
బతుకమ్మ సంబురాలు
రాష్ట్ర సర్కార్‌ ‌బతుకమ్మ చీర
కానుకతో అవ్వ మురిసే

బతుకమ్మతో తెలంగాణ ఖ్యాతి
ప్రపంచానికి ఎరుకాయే ఆడ బిడ్డలు
రంగు రంగు పూలతో బతుకమ్మను
పేర్చి గౌరమ్మను పూజించే సంస్కృతి

బతుకమ్మను ఆదరించని మహిళ
లేదంటే అతిశయోక్తి కాదేమో

పువ్వుల బతుకమ్మ పండుగను
తెలంగాణే కాదు యావత్తు దేశాలు
బతుకమ్మ సంబురాలు చేస్తున్నాయి….

– మిద్దె సురేష్‌, ‌కవి, వ్యాసకర్త
          9701209355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *