ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,సెప్టెంబర్ 25: గత సంవత్సరంతో పోలిస్తే అమెరికాలో వలస జనాభా పెరిగింది. ఇటీవల అమెరికా విడుదల చేసిన జనాభా లెక్కల నివేదిక ప్రకారం చట్ట బద్ధంగానూ, అక్రమంగా వలస వచ్చిన వారు.. అమెరికా జనాభాలో 13.9 శాతం కన్నా ఎక్కువే. 2022 జూలైతో పోలిస్తే అమెరికా జనాభా 33 కోట్ల పై చిలుకుగా ఉంది.
ఇక అమెరికాలో పుట్టే ప్రతి ఏడుగురిలో ఒకరు విదేశీ సంతతి వారేనని తాజా నివేదిక పేర్కొంది. 2022 ఇమ్మిగ్రేషన్ గణాంకాల ప్రకారం అమెరికాలో జీవిస్తున్న ఇమ్మిగ్రేంట్స్‌లో భారతీయులు, చైనీయులు ఆరు శాతం చొప్పున ఉంటారు. అన్ని దేశాల కంటే అమెరికాలో జీవిస్తున్న వలస కార్మికుల్లో మెక్సికన్లే. మొత్తం అమెరికా జనాభాలో మెక్సికన్లు 106.8 లక్షలు. ఇమ్మిగ్రెంట్స్ జనాభాలో ఇది 23 శాతం.




