పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్‌ ‌విజేతలతో… నేడు ప్రధాన మంత్రి మోడీ సమావేశం

హైదరాబాద్‌, ‌సిఐబి, జనవరి 23 : ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌(‌పిఎమ్‌ఆర్‌ ‌బిపి) విజేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి నేడు సాయంత్రం 4 గంటలకు దిల్లీలోని తన నివాసంలో సమావేశం కానున్నారు. భారతదేశం ప్రభుత్వం బాలలకు వారి అసాధారణమైన కార్యసాధనకు గాను ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల’ ను ఆరు కేటగిరీలలో ప్రదానం చేస్తున్నది. నూతన ఆవిష్కరణ, సామాజిక సేవ, విద్య సంబంధిత, క్రీడలు, కళ మరియు సంస్కృతి, ఇంకా సాహసం ..ఈ ఆరు కేటగిరీలు.

ప్రతి ఒక్క పురస్కార విజేతకు ఒక పతకాన్ని, ఒక లక్ష రూపాయల నగదు బహుమతిని, ఒక ధ్రువపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం, పిఎమ్‌ఆర్‌ ‌బిపి-2023 కోసం, దేశం లోని వివిధ ప్రాంతాల నుండి 11 మంది పిల్లల ను వివిధ కేటగిరీలలో బాల శక్తి పురస్కారాలకు గాను ఎంపిక చేశారు. పదకొండు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆరుగురు బాలురు, ఐదుగురు బాలికలు పురస్కార విజేతలలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *