పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధానం తొలగించాలి

‘‘ఇప్పటికే దేశంలో ఐదేండ్ల లోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో ప్రతి 1000కి 40మంది మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 50% శాతం మహిళలు, యువకుల్లో రక్తహీనత ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాంటి స్థితిలో ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ పన్నుల భారంతో పాల వినియోగానికి ప్రజలను దూరం చేస్తున్నారు. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండి కూడా దేశంలోని పౌరులకు పాలు అందించలేకపోవడం సిగ్గుచేటు.’’

దేశ వ్యాపిత ంగా తొమ్మి ది కోట్ల మంది పేద రైతులు పాడిని నమ్ము కుని బతు కుతు న్నారు. అం దులో 75% మంది మహిళలు ఉన్నారు. ఇలాంటి రంగంలో కూడా పేదల జీవనాన్ని దెబ్బతీసే విధంగా పాలు, పెరుగు,  మజ్జిగ, లస్సీ, వెన్న లాంటి ప్యాకెట్లు అమ్మితే 5% శాతం టాక్సీ .. పాలు పితికే యంత్రాలు, వీటిని  నిలువ చేసే కూలింగ్‌   ‌యంత్రాలపై 12 % శాతం నుండి 18%  శాతం ట్యాక్స్  ‌కొత్తగా బిజెపి కేంద్ర ప్రభుత్వం  నరేంద్ర మోడీ  వేస్తున్నారు. ఎలాంటి ప్రజాభిప్రాయం గానీ, పార్లమెంట్‌ ‌లో వివిధ ప్రజా పక్షాల అభిప్రాయాలు గాని వినకుండనే ఈనెల 18 తేదీ నుండి వసూలు చేయడం అప్రజాస్వామ్యం.
మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేకమైన ప్రభుత్వమని మరోసారి రుజువు చేసుకున్నది. ఈ బలవంతపు టాక్స్ ‌వల్ల పాల ఉత్పత్తులను వినియోగించుకోని ప్రజలపై కూడా అనివార్యంగా భారం పడుతుంది. ఈ చర్యతో పేద, మధ్య తరగతి ప్రజానీకానికి కొద్దో  గొప్ప అందుబాటులో ఉన్న పౌష్టికాహారం దూరం కానున్నది. పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌నిత్యవసర సరుకులు ధరలు ఆకాశన్న ంటుతున్న తరుణంలో ఈ భారం సాధారణ ప్రజానీకానికి చాలా కష్టతరమైనది.  ఒకటి రెండు గేదెలతో ప్రారంభమై వంద గేదెలు సాకుతున్న  వాళ్లకు కూడా అన్ని ఖర్చులు పెరిగి గిట్టుబాటు కావడం లేదు. ఈ రంగంలో 2014 నుండి ఇప్పటివరకు చూస్తే గిట్టుబాటు కాక 50 లక్షల మంది చిన్న మధ్య తరగతి రైతులు ఈ రంగంను వదిలివేశారు. కేరళ ఎల్‌.‌డి.ఎఫ్‌ ‌ప్రభుత్వ ఉపాధి పథకం కింద పట్టణ పేదలు ఆవులను పెంచుకొని రోజుకు 10 లీటర్ల చొప్పున 100 రోజులపాటు సొసైటీ కేంద్రానికి  పాలు  పోస్తే సంవత్సరానికి 34,000  వేల రూపాయలు చెల్లిస్తున్నది.
కొత్త విధానం ప్రకారం 25 లీటర్లు అంతకన్నా ఎక్కువ మొత్తంలో సింగిల్‌ ‌ప్యాకెట్‌ ‌పాలు ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసిన వ్యాపారస్తులకి ఎలాంటి జీఎస్టీ చార్జీలు అదనంగా ఉండవు. కానీ  విడివిడి ప్యాకెట్లపై 5% శాతం ట్యాక్స్ ఉం‌టుంది. ఇది చిన్న వ్యాపారస్తులని, వినియోగదారులని దెబ్బతీస్తుంది.
పాల ఉత్పత్తుల పైన, పరికరాల పైన జిఎస్టి ని విధిం చడం వలన పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్ల వినియోగదారులపై భారం పడుతుంది.. పాల సొసైటీలకు పన్ను భారం  కన్వర్షన్‌ ‌ఖర్చులు పెరగడం ప్రారంభమవుతుంది. రైతులకు చెల్లించే బోనస్‌ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. పాడి సోసైటీలో బోనస్‌ ‌చెల్లించకపోతే రైతులకు గిట్టుబాటు కాదు సొసైటీలో మూతపడితే రైతులు పాలు అమ్ముకోలేక జీవనం కోల్పోతారు. పాలు పితికే యంత్రాలపై గానీ, పాల మిషనరీలు 12 % శాతం నుండి 18% శాతం ట్యాక్స్ ఆదనంగా ఉంటుంది. అంటే ఇప్పటికే సంక్షోభంలో ఉన్న పాల సొసైటీ వ్యవస్థలపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా అవుతుంది. పశువుల ద్వారా మరియు పాల ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయం మొత్తం వ్యవసాయ రంగంలో వచ్చే ఆదాయంలో నాలుగవ వంతు ఉన్నది. ఇది గణనీయమైనది. ఇది దెబ్బతింటే పాల రంగంలో జీవనం సాగిస్తున్న  9 కోట్ల మంది పేద ప్రజలపై చాలా నష్టాదాకమైన ప్రభావం చూపుతుంది. మోడీ ప్రభుత్వం ధనికుల మీద డైరెక్టర్‌ ‌ట్యాక్స్ ‌పెంచే బదులు రైతులు, కార్మికులు, కష్ట జీవులందరినీ మీద పరోక్షంగా పన్నులు  పెంచుతుంది. ఈ కార్పొరేట్‌ అనుకూల విధానాలే ధరల పెరుగుదలకు, నిరుద్యోగం పెరగడానికి దారిద్రం వ్యాప్తికి ఫలితంగా మెజారిటీగా ఉన్న కష్టజీవులు ఇంకా దోపిడీ గురవ్వడానికి కారణం అవుతుంది.
మనిషి పుట్టినప్పటి నుండి వాడే వస్తువు నుండి మొదలుకుంటే మనిషి చనిపోయినప్పుడు ఉపయోగించే శవపేటకి వరకు వినియోగించే ప్రతి వస్తువుల సేవల మీద జిఎస్టి అనే పేరుతో పన్నుల భారం పడుతుంది. భారతదేశంలో గేదెపాల ఉత్పత్తి 50 % శాతం ఉంటుంది. ప్రపంచ వ్యాపితంగా ఆవు పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి టాక్స్ ‌లేకుండానే విదేశీ, కార్పొరేట్‌ ‌పెట్టుబడిదారులు పాల పొడి, పాలు, పాల ఉత్పత్తులు దేశంలో అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. దీని ఫలితం దేశంలోని పేద పాడి రైతుల పొట్ట కొట్టడమే. ఇప్పటికైనా కొత్త జీఎస్టీ విధానాన్ని ఉపసంహరించుకోవాలి.
ఇప్పటికే దేశంలో ఐదేండ్ల లోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో ప్రతి 1000కి 40మంది మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 50% శాతం మహిళలు, యువకుల్లో రక్తహీనత ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాంటి స్థితిలో ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ పన్నుల భారంతో పాల వినియోగానికి ప్రజలను దూరం చేస్తున్నారు. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండి కూడా దేశంలోని పౌరులకు పాలు అందించలేకపోవడం సిగ్గుచేటు. ప్రజారోగ్యం గురించి నిరంతరం మాట్లాడే ప్రధాని 47వ జీఎస్‌టీ సమావేశంలో పన్నుల భారం ఎందుకు పెంచినట్లు? ప్రజలేమైనా అధిక ఆధాయంతో తూగిపొతున్నారా?  నేటికీ అతి దారిద్య్రరేఖ కింద 35శాతం మంది, సాధరణ దారిద్య్రరేఖ కింద 75% శాతం ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఆదాయం రెట్టింపు చేస్తుంటే కేంద్రం ప్రభుత్వం మాత్రం పన్నుల పేరుతో పేదలను దోపిడి చేస్తున్నారు. పాల ఉత్పత్తిదారుల పైన, కొనుగోలుదారుల పైన ఈ భారం  పడకుండా పేదలను ఈ భారం నుండి బయట వేయాలంటే ప్రభుత్వం జీఎస్టీ పెంపును వెనక్కి తీసుకోవాలి. పాడు రైతులు ఉద్యమించాలి. రైతు సంఘాలు ట్రేడ్‌ ‌యూనియన్‌, ‌ప్రజా సంఘాలు  ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలి.
image.png
లకావత్‌ ‌చిరంజీవి నాయక్‌, ‌కాకతీయ యూనివర్సిటీ వరంగల్‌, 99630 40960

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *