పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి స్వల్పంగా గుండెపోటు

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 20: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి స్వల్పంగా గుండెపోటుకు గురయ్యారు. నందిగామ సభలో ప్రసంగం తర్వాత కొంత అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా తన వాహనంలో కూర్చోవడానికి వెళ్లినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయారు. కార్యకర్తలు హుటాహుటిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిని షాద్ నగర్ పట్టణంలోని విజయ జ్యోతి ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ లోని మలక్ పేట యశోద ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గుండెపోటు వచ్చినట్టు పార్టీ సభ్యులు చెబుతున్నారు. అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నారు. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలుసుకున్న అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి ఏం జరగవద్దని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *