పార్లమెంట్‌ తరహాలో అసెంబ్లీ

  • ఉభయ సభలూ ఒకేచోట
  • సిఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : పార్లమెంట్‌ తరహాలో తెలంగాణ అసెంబ్లీ ఉంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. శాసనసభ, శాసన మండలి ఓకే దగ్గర నిర్మాణం ఉంటుందన్నారు. శాసనసభ, శాసన మండలి మినహా మరే ఇతర బిల్డింగ్స్‌ అసెంబ్లీ ప్రాంగణం లోపల ఉండవని రేవంత్‌ తేల్చి చెప్పారు. ఇప్పుడు ఉన్న చెట్లను తొలగించకుండా మరింత గ్రీనరీ పెంచాలన్నారు. అసెంబ్లీకి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైల్వే గేట్‌కు అనుకుని ఉన్న ప్రహారీ గోడ ఎత్తు పెంచాలన్నారు. మెంబర్స్‌ ఉదయం పూట వాకింగ్‌ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఇదిలావుంటే జూబ్లీహాల్‌లో ఉన్న మండలిని పాత అసెంబ్లీ భవనంలోకి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇరు సభలు ఒకే దగ్గరగా ఉంటాయి. విభజన సమయంలో పాత అసెంబ్లీ భవనం ఎపి అసెంబ్లీగా ఉపయోగించారు. ఇకపోతే జూబ్లీ హాల్‌ను ప్రధానంగా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు వినియోగించేవారు. ఇప్పుడు దానిని మళ్లీ యధాతథంగా పునరుద్ధరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *